• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అసలేంజరుగుతోంది.?పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సీఎం ఆరా.! కేసీఆర్ తో భేటీ కానున్న బాలకృష్ణ..?

|

హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన కుర్రనటుల మద్య వివాదాలు చెలరేగితే అంత పట్టించుకునే వారు ఉండరేమోగాని, దాదాపు 40 సంవత్పారలుగా పరిశ్రమను శాశిస్తున్న దిగ్గజ నటుల మద్య వివాదం చెలరేగడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. అంతం కాదిది ఆరంభం అన్నట్టు సాగుతున్న వివాదం గురించి రోజుకో నటుడు జోక్యం చేసుకుంటూ అసంబద్ద అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ముదిరుతున్న వివాదం.. జరుగుతున్న పరిణామాల పట్ల సీఎం నజర్..

ముదిరుతున్న వివాదం.. జరుగుతున్న పరిణామాల పట్ల సీఎం నజర్..

అసలు వివాదం ఎందుకు రగిలింది, దానికి వివరణ ఏరూపంలో ఇవ్వాలి, చెలరేగిన ఘర్షణపూరిత వాతావరణాన్ని ఎలా శాంతింపజేయాలనే దిశగా పడుతున్న అడుగులకన్నా, వివాదాన్ని మరింత పెద్దది చేసేదిగా రోజుకో అనుచిత వ్యాఖ్యలు తెరమీదకు వస్తున్నాయి. నాగబాబు, బాలకృష్ట మద్య చెలరేగిన వివాదం అనేక మలుపులు తిరుగుతున్నట్టే అనేక మంది జోక్యం చేసుకోవడం ఎబ్బెట్టుగా పరిణమించింది. ఇదే అంశం పట్ల ప్రభుత్వ వర్గాలు కూడా దృష్టి సారించడం మరింత ఆసక్తి కరంగా మారింది.

వివాదంలో జోక్యం చేసుకుంటున్న ఇతర నటులు.. మరింత వేడెక్కిన సినీ వాతావరణం..

వివాదంలో జోక్యం చేసుకుంటున్న ఇతర నటులు.. మరింత వేడెక్కిన సినీ వాతావరణం..

ఇక్కడ ఎవరు ఎవరిని సమర్ధిస్తున్నారు, ఎవరు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు అనే అంశం అప్రస్తుతమైనప్పటికి చెలరేగిన వివాదం మాత్రం ఎంతో శోచనీయంగా మారింది. ఇక ఇదే అంశం పట్ల సీఎం చంద్రశేఖర్ రావు ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ నెల 8 తర్వాత, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుల తర్వాత బాలకృష్ణతో సీఎం చంద్రశేఖర్ రావు సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్రకధానాయకుల మద్య చెలరేగిన వివాదానికి ఓ ఆమోదయోగ్యమైన ముగింపు లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బాలయ్యతో భేటీ కానున్న సీఎం చంద్రశేఖర్ రావు.. వివాదం పరిష్కారం దిశగా ప్రయత్నాలు..

బాలయ్యతో భేటీ కానున్న సీఎం చంద్రశేఖర్ రావు.. వివాదం పరిష్కారం దిశగా ప్రయత్నాలు..

రహస్యాలు లేకపోతే ఎందుకు పిలవలేదన్న బాలకృష్ణ చిన్న మాట తెలుగు చిత్రపరిశ్రమను కుదిపేస్తోంది. బాలయ్య వ్యాఖ్యల్లో లేనిపోని అర్థాలు వెతికిన నాగబాబు దాని ప్రతిబింభాన్ని వివాదరహితుడు చిరంజీవి వైపు మళ్లించారు. ఏ అంశంపై తొందరపడి స్పందించ కూడదో అదే అంశంపై స్పందించిన నాగబాబు ఇపుడు అనవసరంగా చిరంజీవిని బలిపశువును చేసారనే చర్చ జరుగుతోంది. ఇపుడు బాలకృష్ణ వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అయోమయ పరిస్థితిలో నాగబాబు ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఓ డిజిటల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య నాగబాబు గురించి ప్రస్తావించారు.

ఐకమత్యం ఏమైంది..? పరిశ్రమలో ఉత్పన్నమవుతున్న కొత్త ప్రశ్న..

ఐకమత్యం ఏమైంది..? పరిశ్రమలో ఉత్పన్నమవుతున్న కొత్త ప్రశ్న..

కడుపు చీల్చుకుంటే కాళ్లమీద పడుతుందంటారు. ఇదే అంశం పట్ల చిరంజీవి సంయమనం పాటిస్తున్నా, ఇతరుల జోక్యంతో అంశం పక్క దారి పట్టినట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలను ఇతర మంత్రుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. చెలరేగిన వివాదాన్ని శాంతింపజేసేందుకు, పరిశ్రమలోని నిధులు, గతంలో చేసుకున్న ఒప్పందాలతో పాటు అన్ని సందేహాలకు సమాధానం రప్పించే దిశగా సీఎం చొరవచూపబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం నటుడు బాలకృష్ణ తో రెండుమూడు రోజుల్లో సీఎం చంద్రశేఖర్ రావు సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది.

English summary
It seems that CM Chandrasekhar Rao is meeting with Balakrishna. The meeting expresses the view that the conflict between the two top leaders in the film industry will bring an acceptable end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X