హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో యూనివర్సిటీలపై సీఎం ఫోకస్ .. వీసీల నియామకంపై కేసీఆర్ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలలో పరిస్థితులు దారుణంగా మారాయి . అధ్యాపకుల ఖాళీలు హారతీ చెయ్యక, వీసీలు లేక యూనివర్సిటీలలో పాలన పడకేసింది. యూనివర్సిటీలు పరిశోధన కేంద్రాలుగా , విజ్ఞాన భాండాగారాలుగా పని చెయ్యాల్సిన చోట రాజకీయాలకు అడ్డాలుగా మారుతున్న పరిస్థితులపై ఇప్పటికే చాలా మంది విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఎట్టకేలకు సీఎం కేసీఆర్ తెలంగాణా రాష్ట్రంలోని యూనివర్సిటీల విషయంలో నిద్ర లేచారు. కీలక నిర్ణయం తీసుకున్నారు .

యూనివర్సిటీలపై సీఎం కేసీఆర్ దృష్టి

యూనివర్సిటీలపై సీఎం కేసీఆర్ దృష్టి

యూనివర్సిటీ అధికారుల పట్టింపు లేని తనం, అధ్యాపకుల నిర్లక్ష్య ధోరణి వెరసి తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిస్థితి దయనీయంగా మారుతున్న నేపధ్యంలో సీఎం కేసీఆర్ యూనివర్సిటీల మీద దృష్టి సారించారు .తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో వైస్‌ చాన్సలర్ల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల ఉప కులపతుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

 వీసీ నియామక ప్రక్రియ శరవేగంగా చెయ్యాలని ఆదేశాలు

వీసీ నియామక ప్రక్రియ శరవేగంగా చెయ్యాలని ఆదేశాలు


వీసీ నియామక ప్రక్రియ పూర్వరంగంలో, సెర్చ్ కమిటీ నుంచి పేర్లు తెప్పించుకుని ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.దీనివల్ల వీసీల నియామక ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు.రాబోయే రెండు, మూడు రోజుల్లోనే ఇదంతా జరగాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు.ప్రస్తుతం యూనివర్సిటీల్లో వీసీల నియామకం, ఖాళీల భర్తీ తదితర అంశాలపై దృష్టి సారించిన సీఎం తీసుకున్న తాజా నిర్ణయంతో యూనివర్సిటీలలో పరిస్థితులు మారతాయని భావిస్తున్నారు విద్యార్థులు .

యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు మెరుగు పడేనా ?

యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు మెరుగు పడేనా ?


యూనివర్సిటీలలో పాలన సరిగా లేక, వీసీలు లేక పట్టించుకోక , ఇక అధ్యాపక పోస్టులు కూడా భర్తీ చెయ్యక యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీల మీద దృష్టి పెట్టటం లేదని టాక్ కూడా వినిపించింది. ఇక ఎట్టకేలకు యూనివర్సిటీల విషయంలో సీఎం కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేశారు. వీసీల నియామకం యుద్ధ ప్రాతిపదికన చెయ్యనున్నారు.

English summary
Telangana CM KCR has decided to appoint Vice Chancellors in Telangana Universities. He has taken a key decision on telangana universities. he ordered the officials to appoint the vice chancellors with in two, three days .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X