హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో సీఎం జగన్ క్యాంపు: 13న కేసీఆర్ తో భేటీ : అందరి చూపు అటే..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల పాటు హైదరాబాద్ లో మకాం వేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్లనున్న సీఎం జగన్ తిరిగి 13వ తేదీ సాయంత్రం అమరావతికి తిరిగి వస్తారు. లోటస్ పాండ్ లోనే ఆయన బస చేయనున్నారు. ఇక, ఈ నెల 13వ తేదీన ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీ సీఎం భేటీ అవుతున్నారు. దాదాపు నాలుగు నెలల విరామం తరువాత ఇద్దరు సీఎంల భేటీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తిక రంగా మారుతోంది. కొద్ది రోజులుగా ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం సాగుతున్న పరిస్థితుల్లో తిరిగి ఈ ఇద్దరు సమావేశం కానున్నారు. గతంలో ప్రతిపా దించిన గోదావరి జలాల తరలింపు విషయంతో పాటుగా జాతీయ స్థాయిలో రాజకీయాలు,..తమ రెండు పార్టీల కార్యచరణ పైనా చర్చంచే అవకాశం కనిపిస్తోంది.

హైదరాబాద్ లో జగన్ క్యాంపు..
ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ రోజు నుండి సోమవారం మధ్నాహ్నం వరకు జగన్ హైదరాబాద్ లో ఉండనున్నారు. మూడు రాజధానుల అంశం పైన రాష్ట్రంలో అమరావతి ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి జేఏసీ నేతలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నియ మించిన హైపవర్ కమిటీ ఈ రోజు ముఖ్యమంత్రితో సమావేశమై..రెండు సమావేశాల సారాంశాన్ని వివరించనుంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి హైదరాబాద్ పర్యటన ఆసక్తి కరంగా మారింది. అయితే, వచ్చే వారం లో మూడు రాజధానులకు సంబంధించి కీలకమైన అధికారిక ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగానే అసెంబ్లీలోనూ దీనికి ఆమోద ముద్ర లభించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే, ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ పర్యటన వ్యక్తిగతమని అధికారులు చెబుతున్నారు.

CM Jagan Hyderabad tour for three days..meeting with KCR on 13th..

13న కేసీఆర్ తో భేటీ ఖరారు..
ఇక, ఈ నెల 13న ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి. జగన్ సీఎం అయిన తొలి మూడు నెలల కాలంలోనే ప్రగతి భవన్ లో ..అటు అమరావతిలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరిగాయి. హైదరాబాద్ లోని ఏపీ ఆదీనంలో ఉన్న సచివాలయ భవనాల ను సైతం తెలంగాణకు అప్పగించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి జలాలను తెలంగాణ మీదుగా రాయలసీమకు తరలించే కార్యాచరణ పైన చర్చించారు. దీని పైన ఏపీ శానసభలోనూ సీఎం జగన్ వివరణ ఇచ్చారు. ఇక, ఆర్టీసీ విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య భిన్న తీరుతో వ్యవహరించాయి. ఇక, ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు నదీ జలాల పంపకాల మీద చర్చిస్తారా లేక..రాజకీయ అంశాలకే పరిమితం అవుతారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
AP Chief Minister Jagan stay in Hyderabad for three days. On 13th both telugu states Cms meet in Telangana CM camp office. Now curiosity created on this meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X