హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం.. డైమండ్ నెక్లెస్ గిప్ట్...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ ద‌త్త‌పుత్రిక ప్ర‌త్యూష పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రత్యూష-చరణ్ రెడ్డి ఒక్కటయ్యారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ లూర్ధుమాత చర్చిలో జరిగిన వివాహా వేడుకకు పలువురు హాజరై ఆశీర్వదించారు. షాద్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్‌, జ‌డ్పీ వైస్ చైర్మ‌న్ గ‌ణేశ్‌, మ‌హిళా సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ దివ్య దేవ‌రాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు నూత‌న దంప‌తుల‌ను విష్ చేశారు.

డైమండ్ నెక్లెస్ గిఫ్ట్

డైమండ్ నెక్లెస్ గిఫ్ట్


మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యూషను పెళ్లికూతురిని చేశారు. మంత్రి సత్యవతిరాథోడ్‌, మహిళాభివృద్ధి కమిషనర్‌ దివ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్ర‌త్యూష‌కు పెళ్లి కానుక‌గా సీఎం స‌తీమ‌ణి శోభ‌ ఆదివారం అరుదైన బ‌హుమ‌తిని అంద‌జేశారు. హాజ‌రై ప్ర‌త్యూష‌కు ప‌ట్టువ‌స్త్రాలు అందజేశారు. దాంతోపాటు వ‌జ్రాల నెక్లెస్‌ను కూడా బ‌హుక‌రించి ఆశీర్వ‌దించారు.

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

వేధింపుల పర్వం..

వేధింపుల పర్వం..

హైదరాబాద్‌ బండ్లగూడకు చెందిన ప్రత్యూష తల్లిదండ్రులు మనస్పర్థలతో విడిపోయారు. తల్లి 2003లో చనిపోయేముందు తన పేర ఉన్న ఆస్తిని కూతురు ప్రత్యూష పేరుతో రాసింది. తండ్రి ఆమెను పట్టించుకోపోవటంతో బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్చించారు. 2013లో ప్రత్యూషకు మైనార్టీ తీరింది. ఆ తర్వాత తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. ప్రత్యూష పేరుతో ఉన్న ఆస్తిని దక్కించుకునేందుకు సవతి తల్లి పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. భౌతికదాడులకు సైతం పాల్పడింది. తండ్రి కూడా సవతి తల్లికే సపోర్ట్ చేశారు. దీంతో ప్రత్యూష చిత్రవధ అనుభవించారు.

దత్తత తీసుకున్న కేసీఆర్

దత్తత తీసుకున్న కేసీఆర్

ప్రత్యూష వేధింపుల అంశం అధికారులకు చేరింది. మరణం అంచులకు చేరిన ప్రత్యూషను సవతి తల్లి, తండ్రి చెర నుంచి విముక్తి కల్పించారు. మెరుగైన వైద్యం చేయించారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ ప్రత్యూషను దత్తత తీసుకొన్నారు. ఆమె కోరిక మేరకు నర్సింగ్‌ కోర్సును పూర్తి చేయించారు. ప్రత్యూష ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో పనిచేస్తూ సొంతకాళ్లపై నిలబడింది. ఆమె కోరిక మేరకు రాంనగర్‌కు చెందిన మమత, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో సోమవారం పెండ్లి జ‌రిగింది.

English summary
cm kcr adopt daughter pratyusha marriage with charan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X