హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాదాద్రిలో కేసీఆర్ మహా సుదర్శన యాగం .. యాగ నిర్వహణ పై చినజీయర్ తో చర్చ

|
Google Oneindia TeluguNews

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో భారీ యాగాన్ని తలపెట్టారు . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాదాద్రి ప్రాశస్త్యాన్ని తెలియజేయటంతో పాటుగా యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తి కావస్తున్న నేపధ్యంలో ఆయన యాదాద్రి వేదికగా మహా సుదర్శన యాగాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం .

ఇది తుగ్లక్ పాలన .. జగనన్న ఇసుక బ్లాక్ మార్కెట్ లో.. భగ్గుమన్న లోకేష్ ఇది తుగ్లక్ పాలన .. జగనన్న ఇసుక బ్లాక్ మార్కెట్ లో.. భగ్గుమన్న లోకేష్

త్వరలో సీఎం కేసీఆర్ మహా సుదర్శన యాగం ... చినజీయర్ స్వామితో మాట్లాడిన సీఎం

త్వరలో సీఎం కేసీఆర్ మహా సుదర్శన యాగం ... చినజీయర్ స్వామితో మాట్లాడిన సీఎం

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎప్పడూ ఏదో ఒక యజ్ఞ యాగాదులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షించే సీఎం . ఇప్పుడు ఆయన మరో భారీ యాగాన్ని తలపెట్టినట్లు తెలుస్తోంది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో ‘మహా సుదర్శన యాగం' నిర్వహించాలని సీఎం భావిస్తున్నారని సమాచారం . ఇక మహా సుదర్శన యాగ నిర్వహణ, ఏర్పాట్లపై త్రిదండి చినజీయర్‌ స్వామిని కలిసి కేసీఆర్ ఆయనతో చర్చించారు. జులై 30 మధ్యాహ్నం శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి వెళ్లిన కేసీఆర్‌ యాగ నిర్వహణపై స్వామీజీతో చర్చించారు.

 యాదాద్రి ఆలయంలో యాగనిర్వహణకు కసరత్తు

యాదాద్రి ఆలయంలో యాగనిర్వహణకు కసరత్తు

తెలంగాణాకే తలమానికంగా అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు సీఎం కేసీఆర్ . తాను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి నిర్మింపజేస్తున్న ఆలయానికి చినజీయర్ స్వామి సూచనలను సైతం తీసుకున్నారు. ఇక ఆయన సూచనల మేరకు ఆలయంలో పలు మార్పులు చేశారు. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనులన్నీ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. యజ్ఞం నేపథ్యంలో లక్షలాది సంఖ్యలో భక్తులు యాదాద్రికి తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపైనా స్వామీజీతో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాధిపతులతో పాటు రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాధిపతులతో పాటు రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాధిపతులతో పాటు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలలోని పెద్దలు, గవర్నర్లను ఆహ్వానించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన ఈ యాగానికి 3 వేల మంది రుత్వికులు వారికి సహాయకులుగా మరో 3 వేల మంది వేదం మంత్రోచ్చారణలతో యాగం నిర్వహించనున్నారు . ఇక యాగ నిర్వహణ కోసం 1048 యజ్ఞ కుండాలు ఏర్పాటు చేయనున్నారు. వైష్ణవ పీఠాలతో పాటు భద్రీనాథ్‌, శ్రీరంగం, జగన్నాథ్‌, తిరుపతి నుంచి మఠాధిపతులను ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు.

English summary
Chief Minister K Chandrashekar Rao has decided to organise Maha Sudarshana yagam at Yadadri soon. Chief minister met Chinna Jiyar Swamy regarding the arrangements for the yagam. It was decided in the meeting that the yagam would be taken up in an area of 100 acres and with 1048 yagna kundams. There would be 3,000 Ruthviks and another 3,000 members as their helpers. It was decided to call Governors, chief ministers of other states and Union Ministers and Vaishnav peetham heads, also from Badrinath, Srirangam, Jagannath and Tirupati. Since lakhs of people would be visiting the yagam there would be massive arrangements at the yagashala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X