హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్‌పై మంత్రులు, అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం.. నేతలు అలర్ట్‌గా ఉండాలంటూ..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కోవిషిల్డ్ వ్యాక్సిన్ హైదరాబాద్ చేరుకుంది. వ్యాక్సిన్‌ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కోఠిలో ప్రత్యేక కేంద్రానికి పంపిస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ పంపిణీపై మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. టీకా పంపిణీపై అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. టీకా పంపిణీలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు. ప్రజాప్రతినిధులు యాక్టివ్‌గా ఉంటేనే అధికారులు అలసత్వం వహించరని కేసీఆర్ అన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీతోపాటు పరిపాలనకు సంబంధించిన ఇతర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు.

411 సెంటర్లు.. లక్ష 25 వేల మంది స్టాఫ్

411 సెంటర్లు.. లక్ష 25 వేల మంది స్టాఫ్

ఇటు కరోనా వ్యాక్సినేషన్ కు ​అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్​లో 411 సెంటర్లలో లక్షా 25 వేల మంది హెల్త్​స్టాఫ్ కి వ్యాక్సిన్​ వేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్​తో పాటు మెడికల్​ కాలేజ్​లకు చెందిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఒక్కో సెంటర్​లో నలుగురు చొప్పున మొత్తం 1650 మంది స్టాఫ్ వ్యాక్సినేషన్​లో పాల్గొననున్నారు. రోజుకు 50 నుంచి 100 మందికి వ్యాక్సినేషన్ ఇస్తారు. ఈ నెల 16న గాంధీ, చెస్ట్​, నాంపల్లి ఏరియా, ఫీవర్​ హాస్పిటళ్లతోపాటు సికింద్రాబాద్​ యశోద, సికింద్రాబాద్ కిమ్స్​, బంజారాహిల్స్​ రెయిన్ బో, జూబ్లీహిల్స్​ అపోలో, బొగ్గుల కుంటలోని ఫెర్నాండెజ్​ హాస్పిటల్స్​లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్​గా ప్రారంభించి హెల్త్​ స్టాఫ్ తో మాట్లాడతారు.

ఫ్రంట్ లైన్ వారియర్స్..

ఫ్రంట్ లైన్ వారియర్స్..


ఖైరతాబాద్, వనస్థలిపురం, కూకట్​పల్లి వెల్​నెస్​ సెంటర్లకు ప్రతిరోజూ వెయ్యి వరకు ఓపీ పేషెంట్లకు ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. ఆయా సెంటర్లలో 130 మంది స్టాఫ్ పని చేస్తున్నారు. కరోనా​ టైమ్​లో ఫ్రంట్​లైన్​లో ఉంటూ ట్రీట్ మెంట్​ అందించారు. కొందరు డాక్టర్లతోపాటు స్టాఫ్​ కూడా కరోనా బారిన పడ్డారు. తమను గుర్తించకపోవడంతో సిబ్బంది ఆందోళనలో పడ్డారు. పాజిటివ్ ​వచ్చి క్వారంటైన్​లో ఉన్న వారికి పేవ్​మెంట్​ ఇవ్వలేదని, వ్యాక్సిన్​ ఇచ్చేందుకు వీరి నుంచి ఎలాంటి వివరాలు కూడా తీసుకోలేదు.

అందరికీ వ్యాక్సిన్

అందరికీ వ్యాక్సిన్


హెల్త్​ డిపార్ట్ మెంట్ సిబ్బంది అందరికీ వ్యాక్సిన్​ ఇస్తామని హైదరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి తెలిపారు. మిస్ ​అయితే వారి వివరాలు కూడా సేకరిస్తున్నామని. ఎవరైనా వివరాలు ఇవ్వకుంటే వెంటనే అందించాలన్నారు. ఈజేహెచ్​ఎస్‌కి సంబంధించిన వారి డేటాను కూడా సేకరిస్తున్నామన్నారు. పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. ఫస్ట్​ ఫేజ్​లో ఫ్రంట్​లైన్​ వారియర్స్​కి వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు.

English summary
telangana cm kcr directions to ministers about corona virus vaccine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X