హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

30 రోజుల్లో గ్రామాభివృద్ది... సీఎం కేసిఆర్ దిశానిర్ధేశనం

|
Google Oneindia TeluguNews

సీఎం కేసిఆర్ మరోసారి గ్రామ అభివృద్దిపై కలెక్టర్లతోపాటు గ్రామస్థాయిలో ఉండే క్షేత్రస్థాయి అధికారులు,ప్రజా ప్రతినిధులకు ఆయన దిశనిర్ధేశం చేశారు. ముఖ్యంగా నెల రోజుల పాటు గ్రామాభివృద్దికి ప్రత్యేక కార్యక్రమాల కోసం నివేదిక రూపోందించిన సీఎం వాటి లక్ష్యాలకు కొసం కృషి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే హరిత హరంలో నాటిన చెట్లలో కనీసం 85శాతం మొక్కలు బతికి తీరాలని అన్నారు.

తెలుగు ప్రజల నుంచి మంచి జ్ఞాపకాలను తీసుకెళ్తున్నా... గవర్నర్ నర్సింహన్ తెలుగు ప్రజల నుంచి మంచి జ్ఞాపకాలను తీసుకెళ్తున్నా... గవర్నర్ నర్సింహన్

గ్రామ పంచాయితీ ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలు అంశంపై చేపట్టిన సదస్సులో సీఎం కేసిఆర్ జిల్లా కలెక్టర్లు,మండల,గ్రామ స్థాయి అధికారులతోపాటు పలువురు మంత్రులు హజరయ్యారు. ఈ నేపథ్యంలోనే నెల రోజుల పాటు గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై దిశానిర్ధేశం చేశారు.ఈ సంధర్భంగా నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోని అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. ఈ సారి చేపట్టే హరిత హరం కార్యక్రమంలో 85 శాతం మొక్కలు బతికి తీరాలని ఆయన ఆదేశించారు. లేదంటే స్థానిక సర్పంచ్‌పై వేటు వేస్తామని హెచ్చరించారు.

CM KCR held an extensive conference on the development of panchayats

ఇక 500 జనాభ ఉన్న ప్రతి గ్రామానికి 8 లక్షల రుపాయల అభివృద్ది నిధులను మంజురు చేస్తానని సీఎం కేసిఆర్ చెప్పారు. రానున్న ఆరు నెలల్లో ప్రతి గ్రామానికి స్మశానవాటిక నిర్మించాలని అందుకు కావాల్సిన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని అన్నారు.ఇక ముప్పై రోజుల పాటు చేపట్టిన అభివృద్ది పనులపై కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేసిఆర్ గ్రామాల అభివృద్దిపై నివేదికలు రూపోందిస్తాయని చెప్పారు. ఇందులో భాగంగానే గ్రామాలకు పలు ప్రోత్సహాకాలు ఉంటాయని తెలిపారు. గ్రామాల అభివృద్దిపై అలసత్వం వహించిన సర్పంచ్‌లు కార్యదర్శులపై వేటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, పాల్గొన్నారు.

English summary
CM KCR held an extensive conference on the development of panchayats at Rajendranagar. At this meeting, CM made several suggestions on rural development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X