హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని మోడితో సమావేశం అయిన సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడితో కూడ సీఎం కేసిఆర్ సమావేశం అయ్యారు. సుమారు తోమ్మిది నెలల తర్వాత ఇద్దరు నేతల మధ్య సమావేశం కొనసాగుతోంది. ముఖ్యంగా రెండవ సారి ప్రధానిగా ప్రధాని చేపట్టిన తర్వాతా సీఎం సీఎం కేసిఆర్ ఆయనతో భేటి కాలేదు. అనివార్యకారణాల వల్ల మోడీ ప్రమాణస్వీకారానికి వెళ్లలేకపోయిన సీఎం కేసిఆర్ అనంతరం ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతీ అయోగ్ సమావేశానికి హజరుకాలేదు.

రాష్ట్ర అభివృద్దిలో భాగంగా సీఎం కేసిఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై చర్చించడంతో పాటు, రెండు రాష్ట్రాలకు ముఖ్యమైన నదుల అనుసంధానికి నిధులను సమకూర్చాలని ప్రధానిని కోరనున్నారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానికి జాతీయ హోదా ప్రకటించాలని మరోసారి విజ్ఝప్తి చేయనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఘర్‌ఘర్ జల్ పథకాన్ని మిషన్ భగీరథను అనుసంధానంచేయాలని సీఎం ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. మరోవైపు వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం అందించే అంశంపైనా ప్రధానితో సీఎం చర్చించనున్నారు.

Recommended Video

KCR and JAGAN to Meet PM MODI || హస్తిన వేదికగా జగన్,కేసీఆర్ ఏం చెయ్యబోతున్నారు..??
CM KCR meeting with pm narendra modi at delhi.

అయితే భేటి మర్యాద పూర్వకంగానే జరగనుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించినప్పటికి పలు ఇతర రాజకీయ అంశాలు కూడ చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.కాగా కాసేపటి క్రితం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం అయ్యారు.ఇక అమిత్ షాతో జరిగిన భేటిలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ములుగు, నారయణపేట్, జిల్లాలను నోటిఫై చేయాలని కోరడంతో పాటు, రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమ్యలను కూడ పరిష్కరించాలని సీఎం కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అభివృద్ది అంశాలపై చర్చినట్టు సమాచారం . ముఖ్యంగా షెడ్యుల్ 9,10 లో విభజన అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రాజెక్టులపై కూడ ఆయనతో చర్చించారు.

English summary
CM KCR met with pm narendramodi in the evening at delhi on friday.part of his two-day his visit and discuss about development of state..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X