హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

15 రోజుల్లోగా ఆన్ లైన్ నమోదు - ఇళ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్లపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఇప్పటికీ నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. భూముల రికార్డులకు సర్వస్వంగా భావిస్తోన్న ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.

జగన్ మౌనం బద్దలైతే ప్రళయమే - కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలనం -చంద్రబాబును మూసేస్తారుజగన్ మౌనం బద్దలైతే ప్రళయమే - కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలనం -చంద్రబాబును మూసేస్తారు

ఉన్నతస్థాయి సమీక్ష..

ఉన్నతస్థాయి సమీక్ష..

నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అన్నిస్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు నమోదుకాని ఆస్తుల వివరాలను 100శాతం వెంటనే ఆన్ లైన్ చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్ సహా ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా హాజరయ్యారు.

వ్యవసాయేతర ఆస్తులపై పక్కగా..

వ్యవసాయేతర ఆస్తులపై పక్కగా..

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియను మున్సిపల్ అధికారులు, జిల్లా, మండల, గ్రామ పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఆన్ లైన్ ప్రక్రియను పూర్తి చేయడానికి డీపీఓలు ఎంపీవోలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని సీఎం కోరారు.

ఆన్ లైన్ తోపాటు ఇవి కూడా..

ఆన్ లైన్ తోపాటు ఇవి కూడా..

భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్ కు శ్రీకారం చుడుతున్నామని ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆస్తుల ఆన్ లైన్ నమోదు ప్రక్రియతోపాటు గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటు, ప్రతీ ఇంటికీ 6 మొక్కలు ఇవ్వడం సహా గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని, గ్రామ పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇళ్ల నుండి, గ్రామాల నుండి చెత్తను ఎలా తరలిస్తున్నారనే అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.

చైనాతో టెన్షన్: చర్చలు సఫలం - బలగాల తరలింపు నిలిపివేతకు అంగీకారం - ఉమ్మడి ప్రకటనచైనాతో టెన్షన్: చర్చలు సఫలం - బలగాల తరలింపు నిలిపివేతకు అంగీకారం - ఉమ్మడి ప్రకటన

Recommended Video

Reanth Reddy Slams KCR Govt & Orders Congress Leaders To Help Telangana People || Oneindia Telugu

English summary
Telangana Chief Minister KCR instructed all officials concerned to register all houses, plots, apartments, and other non-agriculture properties in rural and urban areas which have not yet been registered online within 15 days. The CM held a high-level meeting at Pragathi Bhavan to discuss the design of the Dharani Portal which is part of the implementation of the new Revenue Act. During the meeting KCR suggested that all properties should be registered online before the Dharani Portal becomes available for registration transactions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X