• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేసీఆర్ సార్.. ఏందిది.. మొగులయ్యకు కోటి సాయం ఏదీ..? బుక్కెడు అన్నం లేని పరిస్థితి (వీడియో)

|
Google Oneindia TeluguNews

12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీతో సత్కరించిన సంగతి తెలిసందే. భీమ్లా నాయక్ మూవీతో ఆయనకు హైప్ వచ్చింది. వెంటనే సీఎం కేసీఆర్ స్పందించారు. ఇంటి స్థలం.. నిర్మాణం కోసం అయ్యే ఖర్చు రూ. కోటి అందజేస్తామని ప్రకటించారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అయ్యింది. కానీ ఇంతవరకు అదీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మొగులయ్య పరిస్థితి కడు దయనీయంగా ఉంది.

 పరిస్థితి బాగోలేదు

పరిస్థితి బాగోలేదు


తన పరిస్థితిని మొగులయ్య వివరించారు. తనకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి సాయం అందలేదని చెప్పారు. కారులో వెళ్తున్న ఒకరిని ఆపి మరీ ముచ్చటించారు. తనకు సాయం చేయాలని అడిగారు. అందుకు ఇటీవల సాయం అందింది కదా.. రూ.కోటి ఇచ్చారు కదా అని అడిగారు. అబ్బే ఇంకా తనకు అందలేదని చెప్పారు. ఇచ్చారు కదా అని అంటే ఎమ్మెల్యే సారూ ఇప్పిస్తారట అని చెప్పారు. తనకు హెల్ప్ చేయాలని కోరారు. తన పరిస్థితి బాగోలేదని వివరించారు. తన కూతురు చనిపోయిందని చెప్పారు. సరే సార్‌కు చెబుతానని వివరించారు.

బండి సంజయ్ అన్నం పెట్టాడు..

బండి సంజయ్ అన్నం పెట్టాడు..


ఇటీవల బండి సంజయ్‌ను కలిశావట కది అడిగితే.. అవును మీట్ అయ్యానని చెప్పాడు. అన్నం పెట్టి పంపించాడని తన గోడును వెల్లబోసుకున్నాడు. కళాకారుడు తనకు సాయం చేయాలని అడగడం విచారకరం.. ఇస్తా అని చెప్పిన డబ్బులు ఇస్తే బాగుండేది.. వాస్తవానికి అవీ ఇల్లు కోసం.. కానీ దాంతోపాటు అతని జీవనం గడిచేది. మరీ దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

ఇంటి స్థలం, రూ.కోటి నగదు

ఇంటి స్థలం, రూ.కోటి నగదు


కిన్నెర మొగులియ్యకు ఇంటిస్థలంతోపాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోటి రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. మొగులయ్య తో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య ఆ సమయంలో సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతనాన్ని కూడా అందిస్తోందని అంతకుముందు సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని వివరించారు.

జానపద కళకు ప్రాణం పోస్తున్న మొగులయ్య

జానపద కళకు ప్రాణం పోస్తున్న మొగులయ్య

నాగర్‌ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకులకు చెందిన దర్శనం మొగులయ్య.. తాతల నుంచి తనకు అందిన 12 మెట్ల కిన్నెరతో కాలం వెళ్లదీస్తున్నాడు. ముత్తాలనాటి జానపదకళకు ప్రాణం పోస్తున్నారు. ఊరూ వాడా తిరుగుతూ తన కళను అందరికీ పరిచయ చేస్తున్నారు. మొగులయ్య వాయించే పరికరాన్ని మెట్ల కిన్నెర అంటారు. దాన్ని భుజాన పెట్టుకొని పాడే పాటను సాకి అంటారు. స్థానికంగా దొరికే వస్తువులతో ఈ కిన్నెరను తయారు చేస్తారు.

 తాతలే

తాతలే


ఆ పాటల్లోని వ్యక్తుల చరిత్రలు కూడా తన పూర్వీకులు శృతి కట్టినవే అని చెబుతారు. ప్రస్తుతం ఈ సంప్రదాయ వాద్యాన్ని వాయించేది మొగులయ్య ఒక్కరేనని చెబుతున్నారు. మొగులయ్య గళం సినిమా పాట వరకూ చేరడంతో ఆయన రాత్రికి రాత్రే పాపులర్ అయ్యారు. 'ఆడా గాదు, ఈడా గాదు, అమీరోళ్ల మేడా గాదు.. పుట్టిండాడు పులిపిల్ల.. అంటూ సాగే ఈ సాకి యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. పాట పాపులర్ అయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొగులయ్యని అభినందించడంతోపాటు ఆర్థిక సాయం కూడా చేశారు. కానీ మొగులయ్య ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం మారలేదు.

English summary
cm kcr sir where is mogulaiah money. his situation is critical. bandi sanjay offered food.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X