హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ మూడు రెడ్లకు.. ఈ ఒక్కటి రావుకు.. తెలంగాణలో ఏందీ ఎమ్మెల్సీల లెక్క?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రూటే సెపరేటు. ఉద్యమ ప్రస్థానంతో మొదలు రాజకీయ శక్తిగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ స్ట్రాటజీ డిఫరెంట్. ఇక ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలకు ఎదురుండదనే టాక్ ఉంది. ఎన్నికల సోపానంలో ఆయన వేసే పాచికలు మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే లోక్‌సభ ఎన్నికల వేళ కేటీఆర్ పాత్ర ఉండటం వేరే విషయం.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడానికి కేసీఆర్ పదునైన వ్యూహం రచించారు. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి స్థానాల్లో ముగ్గురు రెడ్డిలను బలమైన అభ్యర్థులుగా బరిలోకి దించారు. అయితే ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రావుకు టికెట్ కేటాయించడం చర్చానీయాంశమైంది.

కేటీఆర్ ఫెయిల్.. హరీష్ రావు పాస్.. ఇంతకు ఆ లెక్కలు ఏమిటంటే..! కేటీఆర్ ఫెయిల్.. హరీష్ రావు పాస్.. ఇంతకు ఆ లెక్కలు ఏమిటంటే..!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ముగ్గురు రెడ్డిలు..!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ముగ్గురు రెడ్డిలు..!

ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో టీఆర్ఎస్ ముగ్గురు రెడ్డిలకు టికెట్లు కేటాయించింది. కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో బలమైన అభ్యర్థులను బరిలోకి దించింది. నల్గొండ నుంచి తేరా చిన్నపరెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డిని రంగంలోకి తెచ్చారు. అదే క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేదాకా వేచిచూసిన కాంగ్రెస్ అధిష్టానం ఆ మూడు చోట్ల రెడ్డిలనే బరిలోకి దించడం గమనార్హం.

 ఎమ్మెల్మే కోటాలో రూట్ ఛేంజ్..!

ఎమ్మెల్మే కోటాలో రూట్ ఛేంజ్..!

మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో ఖాళీ ఏర్పడింది. దానికోసం టీఆర్ఎస్ నుంచి కుర్మయ్యగారి నవీన్ రావు పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఆ మేరకు ప్రస్తుతం ఒకే స్థానానికి ఖాళీ ఏర్పడటంతో తొలుత నవీన్‌రావుకు అవకాశం కల్పించారు. త్వరలో ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశం కల్పించనున్నారు.

ఆ మూడు రెడ్డిలకు.. ఈ ఒక్కటి రావుకు

ఆ మూడు రెడ్డిలకు.. ఈ ఒక్కటి రావుకు


ఇటీవల నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటలో ముగ్గురు రెడ్డిలకు ప్రాధాన్యం కల్పించారు. అయితే మూడు చోట్ల రెడ్డిలకే టికెట్లు ఇవ్వడం చర్చానీయాంశమైంది. ఆ క్రమంలో ఈసారి ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో తొలుత గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇస్తే వరుసగా రెడ్డిలకే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని.. తద్వారా నెగెటివ్ ప్రచారం జరిగే ప్రమాదముందని కేసీఆర్ భావించినట్లున్నారు. అందుకే ఈసారి నవీన్ రావుకు తొలి ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతోంది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా నేపథ్యంలో ఆ మూడు చోట్ల రెడ్డిలకే టికెట్లు కేటాయించడంతో వివిధ దినపత్రికల్లో ఆ మూడు రెడ్లకే అంటూ బ్యానర్ ఐటమ్ వార్తలొచ్చాయి. అందుకే ఈసారి కేసీఆర్ జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది.

అక్కడ ఆమె గెలిచి బీజేపీకి అధికారం.. ఇక్కడ ఈయన గెలిచి టీడీపీ పవర్ ఖతంఅక్కడ ఆమె గెలిచి బీజేపీకి అధికారం.. ఇక్కడ ఈయన గెలిచి టీడీపీ పవర్ ఖతం

 ఆ లెక్కలు బరాబర్.. మరి ఇతరుల సంగతి..!

ఆ లెక్కలు బరాబర్.. మరి ఇతరుల సంగతి..!


లోక్‌సభ ఎన్నికల వేళ నవీన్ రావు పేరు మల్కాజిగిరి నుంచి దాదాపుగా ఖరారు చేశారు కేసీఆర్. అయితే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని బరిలోకి దించగానే కేసీఆర్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని నిలబెట్టే క్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని రంగంలోకి తీసుకొచ్చారు.

ఆ క్రమంలో నవీన్ రావుకు మల్కాజిగిరి సీటు తృటిలో చేజారిపోయింది. అయితే తగిన న్యాయం చేస్తానంటూ ఆయనకు కేసీఆర్ హామీ ఇచ్చారట. ఆ మేరకు ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కన్ఫామ్ చేశారు కేసీఆర్. అదలావుంటే టీఆర్ఎస్‌లో సామాజిక న్యాయం కొరవడిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కేసీఆర్ లెక్కలు చూసి రెడ్లు, రావులు తప్ప వెనుకబడిన తరగతులకు ఛాన్స్ లేదా అనే వాదనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

English summary
CM KCR announced naveen rao as mla quota mlc candidate from TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X