హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. యశోదా ఆస్పత్రిలో చేరిక..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. గత రెండు రోజులుగా కేసీఆర్ తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలోని ప్రత్యేక వైద్యుల బృందం ముఖ్యమంత్రికి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రిలో చేరారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

CM KCR suffering from severe fever moves to Yashoda hospital, Hyderabad for treatment

కాగా,మంగళవార ఉదయమే కేసీఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వచ్చినట్టు సమాచారం. వైద్యుల సూచన మేరకే ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. ఆయన వెంట సతీమణి శోభ, కూతురు కవిత, మనవడు హిమాన్ష్, మంత్రి తలసాని శ్రీనివాస్, శుభాష్ రెడ్డిలు కూడా ఆస్పత్రికి వచ్చారు. కేసీఆర్ చేరికతో ఆస్పత్రి చుట్టూ గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

English summary
Telangana Rashtra Samithi president and chief minister K Chandrasekhar Rao had gone to Yashoda hospital at Somajiguda in Hyderabad for treatment following the severe fever and cough. The group of doctors reportedly treating the lean man with utmost care.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X