హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ..

|
Google Oneindia TeluguNews

ఉద్యమ సహచరుడు, హితుడు నాయిని నర్సింహారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే బుధవారం సాయంత్రం నాయిని నర్సింహారెడ్డి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న అపోలో ఆస్పత్రికి సీఎం కేసీఆర్ వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి బంధువులు, కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీ మెంబర్స్ భావొద్వేగానికి గురయ్యారు.

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ అపోలో ఆసుపత్రికి వెళ్లి నాయినిని పరామర్శించారు. సీఎం కేసీఆర్‌ను చూడగానే నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు బాధను ఆపుకోలేకపోయారు. వారు బోరున విలపించగా.. సీఎం కేసీఆర్ వారిని ఓదార్చారు.

cm kcr visits nayini narsimha reddy..

నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషయంపై టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఆయన శరీరం చికిత్సకు స్పందించడం లేదని తెలుస్తోంది. గతనెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత శ్వాస సంబంధ సమస్యలకు గురయ్యారు. వైద్య పరీక్షల్లో న్యూమోనియా అని తేలింది. కరోనా కారణంగా కలిగిన న్యూమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. నాయిని నర్సింహారెడ్డి అనారోగ్యం గురించి తెలిసి టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

English summary
cm kcr visits nayini narsimha reddy, he is suffering with severe illness in few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X