హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కు మీరిచ్చే విలువ ఇదేనా ? ... తెలంగాణా మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

మునిసిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని భావిస్తున్న గులాబీ బాస్ ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలనే అంశంపై, మున్సిపల్ ఎన్నికల కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ సమయానికి వచ్చినా మంత్రులు, ఎమ్మెల్యేలు తాపీగా రావటంతో సీఎం కేసీఆర్ ఆగి మీద గుగ్గిలం అయ్యారు.

 మున్సిపల ఎన్నికల నేపధ్యంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

మున్సిపల ఎన్నికల నేపధ్యంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

మున్సిపల్ ఎన్నికల నగారా మోగటంతో నేడు మంత్రుల, ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించి , పాత కొత్త నేతల మధ్య సయోధ్య కుదిర్చి వారికి బీఫారాలు ఇచ్చి పంపాలని నేడు తెలంగాణా భవన్ లో సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్ . ఎలాగూ గెలిచేది తామేనన్న ధీమాలో ఉన్న టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్ని తేలికగా తీసుకోకూడదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో మొదట నుండీ సీఎం కేసీఆర్ గరంగరం గానే కనిపించారు.

గులాబీ పార్టీలో మొదలైన మున్సిపల్ టికెట్ల లొల్లి .. టికెట్ కోసం పెట్రోల్ పోసుకున్న టీఆర్ఎస్ నేతగులాబీ పార్టీలో మొదలైన మున్సిపల్ టికెట్ల లొల్లి .. టికెట్ కోసం పెట్రోల్ పోసుకున్న టీఆర్ఎస్ నేత

పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్

పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్

ఈ సమావేశానికి హాజరైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. మునిసిపల్ ఎన్నికలపై చర్చించేందుకు, దిశానిర్దేశం చేసేందుకు నిర్వహించిన ఈ మీటింగ్ కు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు సీఎం కేసీఆర్ వచ్చిన కొద్దిసేపటి తర్వాత తాపీగా హాజరు కావటం ప్రారంభించారు. దీంతో సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.

సమయపాలన లేకపోతే కష్టమని సీఎం కేసీఆర్ వార్నింగ్

సమయపాలన లేకపోతే కష్టమని సీఎం కేసీఆర్ వార్నింగ్

సమయపాలన లేకపోతే కష్టమని సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. అంతే కాదు కీలకమైన మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయంపై ఇదేనా మీ నిబద్దత అంటూ గట్టిగా మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రశించారు. సీఎంకు మీరిచ్చే విలువ ఇదేనా అంటూ మండిపడ్డారు. దీంతో షాక్ అయిన సదరు నేతలు..మరోసారి ఇలా రీపీట్ కాదంటూ సారీ చెప్పారని తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో కూడా సీఎం కేసీఆర్ చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. అన్ని చోట్లా గెలిచి తీరాలని తేల్చి చెప్పినట్టు సమాచారం .

English summary
CM KCR seems to be serious about many ministers and MLAs who attended the meeting held in Telangana Bhawan in the wake of municipal elections. Many Cabinet ministers, MLAs, MLCs and constituency coordinators started attending the meeting shortly after the arrival of CM KCR. So, CM KCR became serious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X