హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీసీసీ చీఫ్‌గా ఎవరోచ్చిన సంపూర్ణ సహకారం, ఉత్తమ్ హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో పీసీసీ చీఫ్ పదవీపై ఆసక్తి నెలకొంది. ఉత్తమ్ రాజీనామాతో కొత్త నేత ఎంపికపై హైకమాండ్ దృష్టిసారించింది. అయితే కొందరి పేర్లు వినిపిస్తోండగా వ్యతిరేకత కూడా వస్తోంది. దీంతో ప్రకటన తేదీ వాయిదాపడుతోంది. ఎవరూ పీసీసీ చీఫ్ అయినా.. తాను పూర్తి సంపూర్ణ సహకారాలు అందిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొత్త నేతతో కలిసి పనిచేస్తానని.. పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తానని చెప్పారు. తాజాగా ఉత్తమ్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దీనిని బట్టి ఉత్తమ్‌కు హైకమాండ్ మరో పదవీ ఇస్తుందనే ప్రచారానికి బలం చేకూరుతోంది.

కోమటిరెడ్డికే ఛాన్స్..?

కోమటిరెడ్డికే ఛాన్స్..?


టీపీసీసీ చీఫ్ ఎవరిని హై కమాండ్ ప్రకటించినా సహకరిస్తానన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మానిక్కం ఠాగూర్ నేతృత్వంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో తన అభిప్రాయం చెప్పలేదని చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయమే తనకు శిరోధార్యం అని చెప్పారు. సమావేశం ముగిసిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. ఉత్తమ్ కుమార్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో టీ పీసీసీ బాధ్యతలు ఆయనకే దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ముందే తెలిసిందా..?

ముందే తెలిసిందా..?

కొత్త పీసీసీ చీఫ్ ఎవరనే విషయం ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిసి పోయిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవీకి రాజీనామా చేశారు. దీంతో ఆ తర్వాత బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

రేసులో ఉన్నది వీరే..?

రేసులో ఉన్నది వీరే..?

పలువురు కాంగ్రెస్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, వీహెచ్ సహా పలువురు ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక నిమిత్తం పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మానిక్కం ఠాగూర్ నేతృత్వంలో గాంధీ భవన్‌లో కోర్ కమిటీ సమావేశం జరిగింది. తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను సోనియా గాంధీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

English summary
co-operate to new pcc chief uttam kumar reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X