హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మత రాజకీయాలపై కేటీఆర్ కస్సు బుస్సు.. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని వెల్లడి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మత రాజకీయాలు సరికాదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశంలో ప్రత్యేక పరిస్థితి నెలకొందని .. ఇలాంటి సమయంలో మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. శనివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ వికాస సమితి మహాసభలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కుల, మత రాజకీయాల గురించి ప్రసంగించారు. తెలంగాణలో మాత్రం అందుకు పరిస్థితులు భిన్నమని తెలిపారు.

ఒక మతాన్ని వ్యతిరేకించడం సరికాదని అభిప్రాయపడ్డారు కేటీఆర్. అలాగే ఒక వర్గానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా మంచి పద్ధితి కాదన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని కూడా గౌరవించుకోలేని స్థితికి వచ్చామని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కులా,మతాలకతీతంగా జీవనం కొనసాగుతుందని ప్రశంసించారు. ఒకరు తనతో ఉంటే దేశభక్తుడి .. లేకుంటే ద్రోహివి అనే పరిస్థితి సరికాదన్నారు.

community politics is not correct : ktr

తెలంగాణ వికాస సమతి మంచి ఆలోచనతో ఏర్పడిందని కొనియాడారు. ఇది ఇలాగే కొనాసాగాలని ఆయన ఆకాంక్షించారు. నాథురామ్ గాడ్సే దేశభక్తుడిని సాద్వీ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తాను ఖండించిట్టు గుర్తుచేశారు. కానీ సాద్వీ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తూ కొందరు ట్వీట్ చేయడం బాధ కలిగించిందన్నారు. ఇలా కుల,మతాల పేరుతో విభజించుకుంటూ పోవడం సరికాదన్నారు. ఒకరి అసమంజస వాదనను తెరపైకి తీసుకొచ్చి .. మిగతా వారు ఏకీభవించాలని కోరడం మంచి పద్దతి కాదన్నారు.

English summary
Religious politics is not right TRS Working President KTR. The country has a special situation .. At this time it is not right to do politics in the name of religion. He was the chief guest of Telangana Vikas Samiti Conferences at Telugu University in Nampally on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X