హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్షరాల రూ.49 వేల 600: కంపెనీ, షాపునకు కన్జ్యూమర్ కోర్టు ఆదేశం.. నిర్లక్ష్యం ఖరీదు..

|
Google Oneindia TeluguNews

ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాలి. వినియోగదారులను ఇబ్బందికి గురి చేయొద్దు. వినియోగదారుల ఫోరం (కన్య్జూమర్ కోర్టు)లో ఫిర్యాదు చేయొద్దు. ఇలా చాలా సందర్భాల్లో కంపెనీలకు భారీగా ఫైన్ పడింది. వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తుల విషయంలో కూడా జరిగింది. అయితే హైదరాబాద్‌లో ఓ వినియోగదారుడిని కంపెనీ/ కొనుగోలు చేసిన షాపు ఇబ్బందికి గురిచేసింది. చెప్పి చెప్పి విసిగిపోయిన అతను కన్జ్యూమర్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వారిద్దరీకి కోర్టు భారీ జరిమానా విధించింది.

 షాకింగ్ .. ప్రజా కోర్టు నిర్వహించి మరీ సొంత కమాండర్ ను హతమార్చిన మావోయిస్ట్ లు షాకింగ్ .. ప్రజా కోర్టు నిర్వహించి మరీ సొంత కమాండర్ ను హతమార్చిన మావోయిస్ట్ లు

టీవీ కొనుగోలు..

టీవీ కొనుగోలు..

హైదరాబాద్ మోతీనగర్‌‌కు చెందిన పీ నాగేశ్వర్‌రావు రిటైర్డ్‌ ఉద్యోగి. ఆయన పంజాగుట్టలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షాపులో 2016 నవంబర్‌ 16న ఓ టీవీని కొనుగోలు చేశారు. ఇందుకు రూ.34,600 చెల్లించారు. అయితే టీవీ కొనుగోలు సమయంలో మూడేళ్ల వారంటీని షాపు ఇచ్చింది. అయితే 2019 మే 8న టీవీ పనిచేయడం లేదు. దీంతో షాపును సంప్రదిస్తే కంపెనీకి చెందిన టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయమని చెప్పారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేస్తే టెక్నీషియన్‌ వచ్చి చూశాడు. టీవీ చూసి డిస్‌ప్లే యూనిట్‌ పోయిందని.. స్పేర్‌పార్ట్‌ కోసం హెడ్డాఫీసును సంప్రదిస్తామని, పార్ట్‌ రాగానే తెచ్చి రిపేర్‌ చేస్తామని చెప్పాడు.

 మెయిల్ చేసినా

మెయిల్ చేసినా

నాగేశ్వర్‌రావు పలుమార్లు మెయిల్‌లో సంప్రదించారు. వీడియోకాన్‌ సంస్థ ప్రతినిధులు 2019 అక్టోబర్‌ 25న స్పేర్‌ పార్ట్‌ మీ ఏరియా సర్వీస్‌ సెంటర్‌కు పంపించామని తెలిపారు. త్వరలో టెక్నీషియన్‌ వచ్చి రిపేర్‌ చేస్తాడని మెయిల్‌ కూడా పెట్టారు. నెలరోజులైనా ఎవరూ వచ్చి టీవీ రిపేర్‌ చేయలేదు. దీంతో నాగేశ్వర్ రావు పరిహారంగా రూ.60 వేలు చెల్లించాలంటూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. వీడియోకాన్‌ సంస్థతోపాటు టీవీ విక్రయించిన తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ను ప్రతివాదులుగా చేర్చాడు.

Recommended Video

ICICI Bank Case : CBI Investigating Officer Transferred After Signing On FIR
లోపం జరిగిందని నిర్ధారణ

లోపం జరిగిందని నిర్ధారణ

నాగేశ్వరరావు కేసును విచారించిన జిల్లా వినియోగదారుల ఫోరం-2 సేవ లోపం జరిగినట్టు గుర్తించింది. పరిహారంగా రెండు సంస్థలు కలిపి టీవీ కొనేందుకు వెచ్చించిన మొత్తం రూ.34,600 ఇవ్వాలని స్పష్టంచేసింది. ఇదే కాదు రిపేర్‌ చేయడంలో అలసత్వం ప్రదర్శించి వినియోగదారుడికి మనస్తాపం కలిగించినందుకు రూ.10 వేలు పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5 వేలు చెల్లించాలని స్పస్టంచేసింది. ఈ మొత్తం 45 రోజుల్లో చెల్లించాలని తీర్పు చెప్పింది. కన్జ్యూమర్ కోర్టు తీర్పుపై నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగిందని తెలిపారు.

English summary
company/ shop both will pay rs. 49,600 consumer court order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X