హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు, మళ్లీ రాజకీయాల్లోకి రావొద్దంటూ..

|
Google Oneindia TeluguNews

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన అనుచిత కామెంట్ల రగడ కొనసాగుతోంది. అక్షరం ముక్క రాదు అనే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. తప్పక ధర్మారెడ్డి క్షమాపణ చెప్పారు. అయితే ఇవాళ హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. జాతీయ బీసీ సంఘం అధికార ప్రతినిధి దాసు సురేష్ ఈ ఫిర్యాదు చేశారు.

 యథా రాజా..తథా ప్రతినిధి: ధర్మారెడ్డి కామెంట్స్‌పై రాములమ్మ.. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు యథా రాజా..తథా ప్రతినిధి: ధర్మారెడ్డి కామెంట్స్‌పై రాములమ్మ.. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు

బీసీ, దళిత వర్గాల ఉద్యోగులపై ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీసిన ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. హన్మకొండలో జరిగిన ఓసీల ఘర్జనలో ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని బీసీ జాతీయ సంఘం మండిపడింది. బీసీ, దళిత వర్గాల మనోభావాలను సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకోవాలని కోరారు. చల్లా ధర్మారెడ్డి మళ్ళీ రాజకీయంగా పోటీ చేయకుండా అభిశంసన చేయాలని డిమాండ్ చేశారు.

complaint on parakala mla challa dharma reddy in Hrc

సీఎం కేసీఆర్‌కు బలహీన వర్గాలపై ప్రేమ ఉంటే ఎమ్మెల్యేను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదు.. ఎక్కడ చూసినా వాళ్లే.. మొత్తం నాశనం చేస్తున్నారు అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలో జరిగిన ఓసీ జేఏసీ సభలో కులాలను ఉద్దేశించి ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు భగ్గుమన్నాయి. ధర్మారెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశాయి. కుల సంఘాల ఆగ్రహంతో ఎమ్మెల్యే దిగిరాక తప్పలేదు. ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేయలేదని, క్షమించాలని కోరారు.

తన మాటలను వక్రీకరించారని ధర్మారెడ్డి తెలిపారు. తనపై బురద చల్లేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఆ వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే కూడా క్షమించాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన వారి రిజర్వేషన్ల గురించి వివరించే క్రమంలో అలా మాట్లాడానని ధర్మారెడ్డి అన్నారు.

Recommended Video

#TelanganaMunicipalElectionResults:TRS New History By Gaining 90% Results In 3 Consecutive Elections

English summary
complaint on parakala mla challa dharma reddy in Hrc tuesday for illiteracy comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X