హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇది తల్లా.. రాక్షసా..? పెళ్లికి ముందే కూతురితో కాపురం చేయించింది..!!

|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి/హైదరాబాద్ : సమాజం ప్రపంచీకరణ వైపు పరుగులు తీస్తున్నా సగటు మహిళకు జరగాల్సిన అన్యాయం మాత్రం దేశంలో ఏదో ఓ మూలన క్రమం తప్పకుండా జరిగిపోతోంది. సభ్య సమాజం తల వంచుకునే ఘటన తెలంగాణలో చోజుచేసుకుంది. ఆమెకు చదువుకుని మంచి స్థాయిలో స్ధిరపడాలని కోరిక. తల్లిదండ్రులకు మాత్రం ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టి బాధ్యత వదిలించుకుందామన్న తాపత్రయం. పదహారేళ్ల వయసులోనే ఆమెను ఓ రెండో పెళ్లివాడికిచ్చి పెళ్లిచేయాలనుకుంటే కుదరలేదని అతనితోనే కాపురం చేయించి ఆమె గొంతు కోశారు.

గత జన్మలో తనను హత్య ఎవరు చేశారో చెప్పిన బాలుడు... ఐదేళ్ల తర్వాత సోషల్ మీడియాలో హల్ చల్ గత జన్మలో తనను హత్య ఎవరు చేశారో చెప్పిన బాలుడు... ఐదేళ్ల తర్వాత సోషల్ మీడియాలో హల్ చల్

అంతేకాదు తాను చదువుకుంటాను, తనకు పెళ్లి వద్దు అంటూ ఆ అభాగ్యురాలి వేదనను ఎవరూ పట్టించుకోలేదు. పదో తరగతి పూర్తయిన విద్యార్థినిని ఇంటర్లో చేర్పించాల్సిన ఓ బాధ్యత గల తండ్రి మూర్ఖత్వం.. పెళ్లి చేయకూడని వయస్సులో బలవంతంగా వివాహం జరిపించాలన్న తల్లి నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి ఆ అమాయకురాలిని గర్భవతిని చేశాయి. ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి. హృదయ విదారకమైన ఈ ఘటన సంగారెడ్దిలో చోటుచేసుకుంది.

Concieved before marriage.!Mother played crucial role..!!

సంగారెడ్డికి చెందిన పదహారేళ్ల బాలికకు మూడు నెలల క్రితం తల్లిదండ్రులు నిశ్చితార్ధం చేశారు. పెళ్లి ఇష్టం లేదని ఆపించాలని బాలిక తెలిసిన వారి సాయంతో మహిళా, శిషు సంక్షేమ అధికారులకు విన్నవించింది. బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లి చేయవద్దని హెచ్చరించారు. అయినా అధికారుల హెచ్చరికను లెక్క చేయని ఆ తల్లిదండ్రులు బిడ్డకు పెళ్లయిన వ్యక్తితో నిశ్చితార్థం జరిపి కాపురం చేయించారు.

తల్లిదండ్రుల నిర్లక్ష్యం అధికారుల అలసత్వంతో అమాయకురాలిని గర్భవతిని చేశాయి. బాలిక జివితం చిన్నా భిన్నం చేసింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు అబార్షన్ చేయించారు. బాధ్యుడైన వ్యక్తితో పాటు బాలిక కుటుంబానికి చెందిన నలుగురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు.

English summary
A sixteen-year-old girl from Sangareddy's parents got engaged three months ago. The girl and child welfare authorities have called for help from the girl who knew she wanted to stop the marriage. The girl's parents were counseled and warned not to marry. However, the parents did not heared the warning and kept the child engaged to a married man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X