• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సుమేధ మృతి: తెలంగాణ సర్కార్‌పై రాములమ్మ ఫైర్.. ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి..

|

తెలంగాణ ప్రభుత్వపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మ ఫైరయ్యారు. సుమేధ మృతి ఘటనపై ఒంటికాలిపై లేచారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకా ఎంత మంది బలికావాలని అడిగారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. గత ఆరేళ్లలో ఏం చేశారని దుయ్యబట్టారు. ప్రతీ దానికి గత పాలకులు అని విమర్శించే కేసీఆర్‌కు ఆరేళ్ల సమయం సరిపోలేదా అని అడిగారు. నాలాలు తెరుచుకోవడంతో.. అభం శుభం తెలియని చిన్నారులు ఆసువులు బాస్తున్నారని మండిపడ్డారు.

రాములమ్మ ఫైర్..

రాములమ్మ ఫైర్..

దీనదయాళ్ నగర్‌లో సుమేధ అనే 12 ఏళ్ల విద్యార్థిని నాలాలో పడిపోయి.. చనిపోయిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత విజయశాంతి మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు పోవాలో చెప్పాలని ట్విట్టర్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు. చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని మాటలు చెప్పారే గానీ.. చేతలేవీ అని ఫైరయ్యారు. చినుకు పడితే చాలు జంట నగరాలు చిత్తడవుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కురిసిన వర్షంతో డ్రైనేజీలు నిండి, నాలాలు పొంగి.. మ్యాన్ హోళ్లలోకి నీరు ఎలా వస్తుందో కళ్ల ముందు చూశామని చెప్పారు.

ఆరేళ్లలో ఏం చేశారు..?

ఆరేళ్లలో ఏం చేశారు..?

సిటీలో ఘటనలు జరిగితే అధికార పార్టీ నేతలు వచ్చి, సరిచేస్తామని చెప్పి వెళుతుంటారని పేర్కొన్నారు. కానీ శాశ్వత పరిష్కారం కనుక్కున్నారా అని అడిగారు. గత ప్రభుత్వాలు చేసిన పని వల్లే పలు ప్రాంతాలు మునిగిపోతున్నాయని ఆరోపించారు. మరీ మీరు అధికారం చేపట్టి ఆరేళ్లు అవుతోంది.. ఎందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ కాదు.. పట్టణాలు, నగరాలు కూడా ఇలానే తయారవుతున్నాయని తెలిపారు. కబ్జాలు, అక్రమ కట్టడాలతో మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా మేల్కొవాలని ఆమె సూచించారు.

గిన్నిస్ రికార్డ్ అవుతుంది..

గిన్నిస్ రికార్డ్ అవుతుంది..

వర్షాలు కురవడంతో మ్యాన్ హోళ్లలో చాలా మంది పడిపోయి చనిపోయారని విజయశాంతి గుర్తుచేశారు. చనిపోయిన వారి లెక్కలు తీస్తే గిన్నిస్ రికార్డు అవుతోందని ధ్వజమెత్తారు. ఇకనైనా నివారణ పనులు చేపట్టాలని కోరారు. లేదంటే ప్రజలు ఆగ్రహిస్తారని జోస్యం చెప్పారు. వారి ఆగ్రహాంలో మీరు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అని... మేల్కొవాలని సీఎం కేసీఆర్‌కు హితవు పలికారు.

  BJP Didn’t Fight Nizam, Congress Did, Says Uttam Kumar Reddy | Oneindia Telugu
  విగతజీవిగా బాలిక

  విగతజీవిగా బాలిక

  నెరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధి దీనదయాళ్ నగర్‌లో 17వ తేదీ సాయంత్రం సుమేధ అనే బాలిక అదృశ్యమైంది. ఆ మరునాడు స్థానిక బండ చెరువులో విగతజీవిగా కనిపించింది. సాయంత్రం సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన బాలిక నాలాలో కొట్టుకుపోయింది.. నాలా వద్ద సైకిల్ కనిపించగా.. ఆమె అందులో పడిపోయిందని అనుమానం వ్యక్తమయ్యింది. అయితే మృతదేహాం లభించడంతో పేరంట్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

  English summary
  congress leader vijayashanti slams kcr government on child sumedha dead issue.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X