హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై కాంగ్రెస్ నేతల స్పందన .. సీనియర్ నేత వీహెచ్ , సీతక్క సంచలనం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నారన్న వార్త ప్రస్తుతం దుమారం మారింది. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు కారణంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తూ వైయస్సార్ టిపి పేరుతో పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ నేతలు షర్మిలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తమ స్పందనను తెలియజేస్తున్నారు.

YS Jagan: వైఎస్ షర్మిల రాజకీయ పార్టీపై నోరు మెదపని జగనన్న...ఆసక్తికర చర్చ!YS Jagan: వైఎస్ షర్మిల రాజకీయ పార్టీపై నోరు మెదపని జగనన్న...ఆసక్తికర చర్చ!

 జగన్ కు , షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమే: వీహెచ్

జగన్ కు , షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమే: వీహెచ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వి హనుమంత రావు వైయస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై స్పందించారు. అన్న జగన్ మోహన్ రెడ్డి పార్టీ కోసం షర్మిల చాలా కష్టపడ్డారని పేర్కొన్న వీహెచ్, అన్న పై కోపం ఉంటే ఏపీలో పార్టీ పెట్టాలి కానీ తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం వైయస్ జగన్ కు , షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని తేల్చి చెప్పారు వి హనుమంత రావు. ఇక తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీకి వైయస్ రాజశేఖర్ రెడ్డి నుండి లబ్ది పొందిన వాళ్లు, ఆయనతో ఆత్మీయంగా మెలిగిన వాళ్లు సహకరించే అవకాశం ఉందని వీహెచ్ పేర్కొన్నారు.

 షర్మిల ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగపడుతుందన్న సీతక్క

షర్మిల ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగపడుతుందన్న సీతక్క

ముఖ్యంగా ఒక సామాజిక వర్గం షర్మిలకు అండగా ఉంటుందని విహెచ్ అభిప్రాయపడ్డారు . తెలంగాణలో ఓట్లు చీల్చడం కోసం ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర అన్న వీహెచ్ తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టటంపై తన అభిప్రాయం తెలియజేశారు.

ఇక వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. షర్మిల ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగపడుతుందని సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

షర్మిల పార్టీ పెట్టడం వెనుక ఉన్నది ఎవరో త్వరలోనే బయటకు

షర్మిల పార్టీ పెట్టడం వెనుక ఉన్నది ఎవరో త్వరలోనే బయటకు

ఇతర పార్టీలకు మేలు చేయడం కోసం రాజన్న పేరును షర్మిల వినియోగించవద్దని సీతక్క హితవు పలికారు. కొన్ని పార్టీల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఉపయోగపడొద్దని సీతక్క పేర్కొన్నారు. రాజీవ్ రాజ్యమైనా, రాజన్న రాజ్యమైనా కాంగ్రెస్ తోనే సాధ్యమని సీతక్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ , రాజశేఖర్ రెడ్డి వేరువేరు కాదన్నారు సీతక్క. కాంగ్రెస్ పార్టీ ఉండగా వైఎస్సార్ టీపీ అవసరం లేదన్న అభిప్రాయం సీతక్క వ్యక్తం చేశారు. షర్మిల పార్టీ పెట్టడం వెనుక ఉన్నది ఎవరో త్వరలోనే బయటపడుతుందని సీతక్క పేర్కొన్నారు.

English summary
Senior Congress leader V Hanumantha Rao reacted on YS Sharmila's new party. VH said that Sharmila had worked very hard for the party of Jagan Mohan Reddy, if there is anger against jagan, she should put the party in the AP but why it is being formed in Telangana he questioned . At present, it is true that there are differences between Ys Jagan and Sharmila. Congress MLA Sitakka reacts on YS Sharmila's political party. Sitakka said that someone behind Sharmila's partying will come out soon..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X