హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ రెడ్డికి చెప్పులను గిఫ్ట్‌గా ఇచ్చిన ఎమ్మెల్యే సీతక్క: ఎందుకో తెలుసా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డి.. కొనసాగిస్తోన్న పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టదలిచిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రాజీవ్ రైతు భరోసా ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం రాత్రి నుంచి పాదయాత్ర చేస్తోన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట్ నుంచి హైదరాబాద్‌కు ఆయన పాదయాత్ర చేస్తోన్నారు. పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. రోజురోజుకూ పాదయాత్ర బలపడుతోంది.

పాదయాత్ర చేస్తోన్న రేవంత్ రెడ్డికి.. ములుగు శాసనసభ్యురాలు సీతక్క అనూహ్య బహుమతిని ఇచ్చారు. ఆయనకు చెప్పులను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ ఉదయం ఆమె పాదయాత్ర శిబిరానికి వెళ్లారు. రేవంత్ రెడ్డిని కలిసి.. చెప్పులను ఇచ్చారు. పాదయాత్ర చేస్తోన్న సమయంలో అరికాళ్లు నొప్పి పెట్టకుండా ఉపశమనం కలిగించే పెయిన్ రిలీఫ్ స్లిప్పర్స్ అవి. వాటితోనే పాదయాత్ర సాగిస్తానని రేవంత్ రెడ్డి చిరునవ్వుతో సీతక్కకు బదులిచ్చారు. రాజీవ్ రైతు భరోసా యాత్రకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తోందని సీతక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Congress MLA Seethakka gift to pain relief slippers to Party MP Revanth Reddy, why?

మూడు వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ దేశ రాజధానిలో రోజుల తరబడి దీక్షలు చేస్తోన్న రైతాంగానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ.. జాతీయస్థాయిలో రాజీవ్ రైతు భరోసా ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీపీసీసీ నాయకులు రైతు భరోసా దీక్షలను ప్రారంభించారు. ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో ఈ ఆందోళలను నిర్వహిస్తున్నారు. ఆదివారం అచ్చంపేట్‌లో నిర్వహించిన ఆందోళనలో రేవంత్ రెడ్డి, సీతక్క, మల్లు రవి పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క, మల్లు రవి చేసిన సూచనలకు అనుగుణంగా అప్పటికప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు.

English summary
Telangana Congress MLA Seethakka gift to pain relief slippers to Party MP and TPCC Working President Revanth Reddy, who is conducted Rajiv Raithu Bharosa Padayatra in support of Farmers protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X