హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ లోకి వెళ్లం.. కాంగ్రెస్ లోనే ఉంటాం.. ఆ ఎమ్మెల్యేలు ఎవరో తెలుసా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Congress MLA's Told That They Stand With Their Party Only | Oneindia Telugu

హైదరాబాద్ : ప్రాణమున్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగతానంటున్నారు మాజీ మంత్రి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. టీఆర్ఎస్ పార్టీలో తాను చేరబోతున్నానంటూ వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు. అదంతా దుష్ర్పచారమని ఖండించారు. చివరి వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని.. పార్టీలు మారే యోచన తనకు లేదని తెలిపారు.

సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతున్నారనే వార్త ఒకటి గురువారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అదంతా టీఆర్ఎస్ మైండ్ గేమ్ అంటూ కొట్టిపారేశారు.

congress mlas told that they stand with their party

అదలావుంటే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తాము పార్టీ మారే ప్రసక్తి లేదంటున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా కాంగ్రెస్ లోనే కొనసాగుతామంటున్నారు. పార్టీ మారుతున్నారనే వార్తలపై వేర్వేరు సందర్భాల్లో తమ నిర్ణయం మీడియాకు తెలిపారు. తాము టీఆర్ఎస్ లోకి వెళతామనే ప్రచారం సరికాదని.. అవన్నీ వదంతులేనని తేల్చేశారు.

English summary
The former minister, Maheshwaram Congress MLA Sabita Indra Reddy, is continuing to remain in the Congress party. The TRS party has dismissed the news that she was going to join the party. Kothagudem MLA Vanama Venkateswara Rao, Palair MLA Kandaala Upender Reddy and Bhadrachalam MLA Pudem Veerayya also said that they stand with congress party only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X