congress mlc jeevan reddy CM kcr nagarjuna sagar bypoll jana reddy mp revanth reddy sonia gandhi కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జానా రెడ్డి హై కమాండ్ సోనియాగాంధీ రాహుల్ గాంధీ politics
t pcc race:కేసీఆర్ ట్రాన్స్ జెండర్ అయ్యారా...? మీసం మేలేసీ పిల్లిలా.. జీవన్ రెడ్డి
సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీకి మొగుడిని అవుతానాని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ట్రాన్స్ జెండర్ అయ్యారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ శిఖండిగా మారారని విమర్శించారు. ఢిల్లీలో మోదీ కాళ్ళు పట్టుకున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనీయమని హెచ్చరించారు.
ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగిస్తే ఇబ్బందులు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అందుకే కేసీఆర్: జీవన్

జగీర్ కాదు..
తెలంగాణ కేసీఆర్ జగీర్ కాదని, రైతు బంధు పథకం పచ్చి మోసమని జీవన్ రెడ్డి విమర్శించారు. పంటకు మద్దతు ధర ప్రకటించటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఎక్కడ పుడితే ఏంటి అని, పేదల బాధలు తెలిసిన వ్యక్తి అని ప్రశంసించారు. శ్మశానవాటికలు, డప్పింగ్ యార్డులను కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకంతోనే అభివృద్ధి చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

యూ టర్న్
వ్యవసాయ చట్టంపై కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుందని చెప్పారు. కనీస మద్దతు ధర లభిస్తేనే రైతులకు న్యాయం జరగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రైతులకు మద్దతు ధర కల్పించిందని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు దుకాణం తెరవకుంటే.. టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని హెచ్చరించారు.

జీవన్- రేవంత్
టీ పీసీసీ చీఫ్ రేసులో జీవన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. నాగార్జున సాగర్ బై పోల్ తర్వాతే నియామక ప్రక్రియ చేపడుతారు. అయితే ఈ లోపు జీవన్ రెడ్డి స్వరం పెంచారు. దీంతో టీ పీసీసీ చీఫ్ జీవన్ రెడ్డి అని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆయన ఢిల్లీ కూడా వెళ్లొచ్చారు. ఆ తర్వాతే మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్ రెడ్డి కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

స్వరం పెంచిన జీవన్ రెడ్డి
టీపీసీసీ రేసులో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఎంపీ రేవంత్‌రెడ్డే కాబోయే చీఫ్ అంటూ వార్తలు వచ్చినప్పటికీ.. రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ప్రజాకర్షణ, కార్యకర్తల మద్దతు రేవంత్‌కే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యేమార్గంగా జీవన్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా, రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించే యోచనలో హైకమాండ్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో జానారెడ్డి ప్రతిపాదన చేశారు. ఆయన చేసిన వినతి కూడా పార్టీకి మేలు చేసేది కాగా.. హై కమాండ్ వెనక్కి తగ్గింది. అయితే కానీ దీనిని కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇటు జీవన్ రెడ్డి తన స్వరం కాస్త పెంచారు. దీంతో పీసీసీ చీఫ్ పదవీ జీవన్ రెడ్డికే ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.