హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎల్పీ విలీనంపై పోరాట పంథాను మార్చిన కాంగ్రెస్.. బట్టి దీక్ష విరమణ

|
Google Oneindia TeluguNews

సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్ పార్టీ ఉదృతం చేసింది. ఎమ్మెల్యేల విలీనంపై కోర్టుకు వెళ్లింది. ఇందులో భాగంగానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కాంగ్రెస్ పిటిషన్ స్వికరించిన కోర్టు వచ్చే వారం విచారణ చేపట్టనుంది. మరోవైపు మంగళవారం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టనుంది. దీంతో రాష్ట్ర్ర స్థాయిలో ఆందోళన చేపట్టాలని ఆపార్టీ నిర్ణయించింది.

నూతన సెక్రటేరియట్‌కు ముహుర్తం జూన్ 27..? నూతన సెక్రటేరియట్‌కు ముహుర్తం జూన్ 27..?

సీఎల్పీ విలీనంపై కోర్టుకు వెళ్లనున్న కాంగ్రెస్

సీఎల్పీ విలీనంపై కోర్టుకు వెళ్లనున్న కాంగ్రెస్

సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో కేసును విచారిస్తామని కోర్టు తెలిపింది. అనంతరం మీడియా తో మాట్లాడిన ఉత్తమ్ కేసీఆర్‌ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు.. నాలుగు నెలలు నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భయపెట్టి వారిని కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. ఇక పార్టీ మారినా వారిపై వేటు వేయకుండా స్పికర్ వారిని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తూ బులెటిన్ కూడ విడుదల చేయడంపై ఆయన మండిపడ్డారు. విలీనంపై హైకోర్టులో న్యాయం జరగక పోతే సుప్రిం కోర్టుకు వెళతామని తెలిపారు.

కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా

కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా

మరోవైపు టీఆర్ఎస్ విధానాలను నిరసిస్తూ మంగళవారం రాష్ట్ర్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల ముందు ధర్న చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలోనే ఎమ్మెల్యేల తీరును ఎండగడతూ ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించింది. దీంతోపాటు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే రానున్నరోజుల్లో న్యాయ స్థానాలను అశ్రయించడంతోపాటు ప్రజల్లో కూడ టీఆర్ఎస్ విధానాలపై పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించింది.

 సీఎల్పీ విలీనంపై దీక్ష చేపట్టిన భట్టి విక్రమార్క...భగ్నం చేసిన పో్లీసులు

సీఎల్పీ విలీనంపై దీక్ష చేపట్టిన భట్టి విక్రమార్క...భగ్నం చేసిన పో్లీసులు

కాగా టీఆర్ఎస్ తీరును నిరసిస్తూ ఆపార్టీ నేత భట్టి విక్రమార్క మూడు రోజుల పాటు అమరణ నిరహార దీక్ష చేశారు. అయితే ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తున్న భట్టి విక్రమార్కను పోలీసులు అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేశారు. అనంతరం ఆయన్ను నిమ్స్ అసుపత్రికి తరలించారు.అరెస్ట్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి. మరోవైపు భట్టి ఆరోగ్యం క్షిణిస్తుండడంతో పార్టీ హైకమండ్ జోక్యం చేసుకుంది.దీంతో భట్టి విక్రమార్క నిమ్స్‌లో దీక్షను విరమించారు. ఈనేపథ్యంలోనే న్యాయపోరాటం చేయాలని పార్టీ నిర్ణయించింది.

English summary
congress party filed a petition against the clp merge in trs. and petition will be come to before the court next week,and party going to dharna be fore the collectortes on tuesday.The party decided to take up the issue at the state level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X