హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్మలమ్మ మోడీ చేతిలో కీలు బొమ్మ.. దక్షిణాదికి మొండిచెయ్యే : రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్‌పై పెదవి విరిచారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపారని మండిపడ్డారు. విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చే పథకాలు లేకుండా లోపభూయిష్టంగా బడ్జెట్ కూర్పు జరిగిందని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు రూపాయి పన్ను చెల్లిస్తే.. తిరిగి కేవలం 65 పైసలు మాత్రమే కేటాయించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

దక్షిణాదిపై ఉత్తర భారతానికి చెందిన నేతల వివక్ష స్పష్టంగా అర్థం అవుతోందని ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాల నేతలు కూడా ఆలోచించి కేంద్ర వైఖరిని ఖండించాలని పిలుపునిచ్చారు. ఇన్‌కం ట్యాక్స్ లో పేద, మధ్యతరగతి వారికి ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. దక్షిణాదికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రధాని మోడీ చేతిలో కీలుబొమ్మ అయ్యారని ఎద్దేవా చేశారు.

congress mp revanth reddy fires on central budget

10, 20కి చీరలు.. అవన్నీ ట్రిక్కులు.. మీ ప్రాణాలకు ప్రమాదం అక్కలు (స్పెషల్ స్టోరీ)10, 20కి చీరలు.. అవన్నీ ట్రిక్కులు.. మీ ప్రాణాలకు ప్రమాదం అక్కలు (స్పెషల్ స్టోరీ)

తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా.. సీఎం కేసీఆర్ నోరు మెదపకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. కేసులకు భయపడే కేసీఆర్ మౌనం దాల్చారని, బడ్జెట్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉన్నారంటే దానర్థమేంటని ఫైరయ్యారు. అదలావుంటే దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఒక మహిళా ఆర్థిక మంత్రి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ప్రప్రథమం.

English summary
Congress MP Revanth Reddy made hot comments on Central budget. He argues that Southern Minister Nirmala Sitaraman not favour the south states because she was in hand of PM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X