దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ అక్రమాలు ... కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేయడంతో పాటుగా, హరీష్ రావు దుబ్బాక గెలుపు బాధ్యతను భుజాలపై వేసుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బీజేపీకి 300 ఫీట్ల లోతున పాతిపెట్టాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. బిజెపి, కాంగ్రెస్ లతో ఎలాంటి అభివృద్ధి జరగదని తెగ ప్రచారం చేస్తున్నారు.
దుబ్బాక ఉపఎన్నిక హీట్ .. బస్టాండ్‌కు రమ్మన్న బండి సంజయ్ పత్తాలేడన్న హరీష్ రావు

కేంద్రబలగాలను పంపాలని కేంద్ర ఎన్నికల కమీషన్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ
ఈ క్రమంలో అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ పార్టీలు కూడా తమ శక్తియుక్తులను ఉపయోగించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొంటూ టిఆర్ఎస్ పార్టీపై విమర్శల బాణాలు సంధిస్తున్నారు.
ఇదిలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపి ఉప ఎన్నిక స్వేచ్ఛగా ,పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరారు .

అక్రమమార్గంలో గెలవటానికి టీఆర్ఎస్ , బీజేపీలు ప్రయత్నం చేస్తున్నాయని ఫిర్యాదు
టిఆర్ఎస్,బిజెపిలు ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తున్నాయి అని, అక్రమ మార్గంలో గెలవడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ క్రింద చర్యలు తీసుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక స్వేచ్ఛగా నిర్వహించటం కోసం తక్షణమే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

దుబ్బాకలో ఉన్న పోలీసులను, అధికారులను అక్కడ నుండి తరలించాలని విజ్ఞప్తి
దుబ్బాక లో ప్రతి మండలానికి కనీసం ఒక కేంద్ర పరిశీలకుడిని పంపి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఇక రాష్ట్ర పోలీసులు ,జిల్లా అధికారులు ప్రలోభాలకు లోనవుతున్నారని పేర్కొంటూ తక్షణమే వారిని దుబ్బాక నుండి పంపించి వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి అంటే ప్రస్తుతం ఉన్న అధికారులను మార్చటం తప్పనిసరి అంటూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

దుబ్బాకలో హీటెక్కిన ప్రచార పర్వం
దుబ్బాక ఎన్నికల్లో ఓటర్లను ప్రభు పెట్టడానికి ప్రయత్నాలు జోరుగానే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అధికార టీఆర్ఎస్, బిజెపిలు డబ్బు ,మద్యం పంపిణీకి తెగబడినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకం కావడంతో సర్వ శక్తులను ఒడ్డుతున్నాయి ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ టీఆర్ఎస్ , బీజేపీలను టార్గెట్ చేస్తుంటే టీఆర్ఎస్ బీజేపీ , కాంగ్రెస్ లను టార్గెట్ చేస్తుంది. ఇక బీజేపీ టీఆర్ఎస్ , కాంగ్రెస్ లను టార్గెట్ చేస్తూ ప్రచారపర్వంలో దూసుకుపోతుంది.