• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మున్సిపల్ అభ్యర్థులకు కాంగ్రెస్ కొత్త మెలిక.. వ్యూహం ఫలిస్తుందా..?

|

ఎన్నికలు ఏవైనా.. గెలిచిన అభ్యర్థులు అధికార పార్టీలోకి జంప్ అవడం ఈరోజుల్లో కామన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో గత అసెంబ్లీ,మున్సిపల్ ఎన్నికల తర్వాత చాలామంది నేతలు అధికార టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరిస్తోంది. ఇందుకోసం టికెట్ ఇచ్చేటప్పుడే మెలిక పెడుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ టికెట్‌ అందుకునే అభ్యర్థులు.. ఎన్నికల్లో గెలిచాక పార్టీ మారబోమని బాండ్ పేపర్‌పై హామీ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు జనసేన దూరం: కానీ, వారికి పవన్ కళ్యాణ్ మద్దతు

 కాంగ్రెస్ వ్యూహం :

కాంగ్రెస్ వ్యూహం :

కాంగ్రెస్ టికెట్ కోరుకునే అభ్యర్థులు.. దరఖాస్తుతో పాటు రూ.20 స్టాంప్ పేపర్‌పై హామీ పత్రం,బ్లాంక్ చెక్ సమర్పిస్తేనే టికెట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గెలిచాక పార్టీ మారబోమని పేర్కొనడంతో పాటు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం జారీ చేసే విప్ పాటిస్తామని అందులో హామీ ఇవ్వాలి. ఈ షరతులకు ఒప్పుకునేవారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ ఖరాఖండిగా చెబుతోంది.

స్వాగతిస్తున్న కార్యకర్తలు.. :

స్వాగతిస్తున్న కార్యకర్తలు.. :

ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తరుపున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 1000 మంది అభ్యర్థుల్లో దాదాపు 500 మంది ఇప్పటికే పార్టీ కండిషన్స్‌ను ఒప్పుకున్నట్టు సమాచారం. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో హార్డ్‌కోర్ కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. 2014లో నల్గొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ 7 స్థానాలు కైవసం చేసుకోగా.. అందులో ఆరుగురు నేతలు ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిపోయారని గుర్తుచేస్తున్నారు. కాబట్టి వలసలకు బ్రేక్ వేయాలంటే ఇలాంటి కండిషన్స్ తప్పనిసరి అంటున్నారు.

గతంలోనూ ఇలాంటి స్ట్రాటజీ..:

గతంలోనూ ఇలాంటి స్ట్రాటజీ..:

మిగతా స్థానాల సంగతి పక్కనపెడితే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో ఈ బాండ్ పేపర్‌ కండిషన్‌ను తప్పనిసరిగా అమలుచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అలా అయితేనే నేతలు పార్టీ గోడ దూకకుండా ఉంటారని భావిస్తోంది. అయితే బాండ్ పేపర్ల కండిషన్ ఇదే మొదటిసారేమీ కాదు. గతేడాది జరిగిన జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ కండిషన్‌తోనే టికెట్లు ఇవ్వాలని కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఆ ప్రతిపాదనను అమలుచేయకపోయినా అక్కడక్కడా బాండ్ పేపర్ హామీతోనే టికెట్లు ఇచ్చారు.

వ్యూహం ఫలిస్తుందా..:

వ్యూహం ఫలిస్తుందా..:

కాంగ్రెస్ పార్టీ బాండ్ పేపర్ కండిషన్ ఎంతవరకు పనిచేస్తుందన్నది అసలు ప్రశ్న. ఒకవేళ బాండ్ పేపర్‌ సమర్పించిన అభ్యర్థులు కూడా.. గెలిచాక పార్టీ మారితే పరిస్థితేంటి..? దీనిపై కాంగ్రెస్ కోర్టుకు వెళ్తుందా..?

కోర్టులు బాండ్ పేపర్ కండిషన్స్‌ను ఎంతవరకు ఆమోదిస్తాయి..? వంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. తాను గెలిచాక ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానని గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అక్కడి రైతులకు హామీ ఇచ్చారు. అంతేకాదు,బాండ్ పేపర్‌ కూడా రాసిచ్చారు. కానీ ఇప్పటివరకు ఆయన పసుపు బోర్డు తీసుకురాలేదు. దీంతో బాండ్ పేపర్ రాసిచ్చి ఏమి లాభం.. చిత్తశుద్ది లేనప్పుడు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్న కాంగ్రెస్‌కు బాండ్ పేపర్ ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాలి.

English summary
After suffering large scale defection of its elected representatives into the ruling Telangana Rashtra Samithi (TRS) in the last five years, the Congress in Telangana has set a pre-condition for its candidates for the municipal elections in the state on January 22, notification for which was issued on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more