• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హుజురాబాద్ బై పోల్: నలుగురి పేర్లను హైకమాండ్‌కు పంపిన కాంగ్రెస్, లేని కొండా సురేఖ పేరు

|

హుజురాబాద్ బై పోల్ కోసం షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. దీంతో అభ్యర్థుల ఎంపిక అంశం చర్చకు వచ్చింది. బీజేపీ- టీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ ఇంకా క్యాండెట్ కన్ఫామ్ చేయలేదు. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. అయితే షార్ట్ లిస్ట్ లో కొత్త పేర్లు చేరాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ కమిటీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి చేసి.. అధిష్టానానికి పంపించారు. అందులోనలుగురి పేర్లను పేర్కొన్నారు.

లేని కొండా సురేఖ పేరు

లేని కొండా సురేఖ పేరు

ఇదివరకు ప్రచారం జరిగిన కొండా సురేఖ పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మున్నురుకాపు సామాజిక వర్గానికి చెందిన కృష్ణారెడ్డి, రవికుమార్, ప్యాట రమేశ్.. దళిత సామాజిక వర్గానికి చెందిన సైదులు పేరును పంపించారు. గతంలో కౌశిక్ రెడ్డి పోటీ చేసి.. భారీగానే ఓట్లు సాధించారు. ఈ సారి ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో అభ్యర్థి వేట తప్పడం లేదు. ఓ క్రమంలో పొన్నం ప్రభాకర్ పేరు వినిపించింది. తర్వాత కొండ సురేఖ పేరు కూడా తెరపైకి వచ్చింది.

రెండు పార్టీల అభ్యర్థుల వీరే

రెండు పార్టీల అభ్యర్థుల వీరే

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున విద్యార్థి నాయ‌కుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పోటీ చేస్తున్నారు. రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీ తరుఫున పోటీ చేస్తున్నారు. కాగా తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో తన ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12న ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

మంత్రుల మకాం..

మంత్రుల మకాం..

మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ హుజురాబాద్‌లోనే మకాం వేసి కార్యకర్తల్లో కొత్త జోష్‌ నింపుతున్నారు. ఇదివరకు చేసిన అభివృద్ది పనులను వివరిస్తూ.. టీఆర్ఎస్‌ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. అటు ఈటల భార్య జమున సైతం హుజురాబాద్‌లోని పలుగ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో రానున్న రోజుల్లో తేలిపోనుంది. కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. అందులో భాగంగానే కొండా సురేఖ పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది.

దళితబంధువు

దళితబంధువు

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. బై పోల్ చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి.

  ధరణి పోర్టల్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన ఎమ్మెల్యే సీతక్క || Oneindia Telugu
  షెడ్యూల్ విడుదల

  షెడ్యూల్ విడుదల

  హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహించి.... నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది.

  English summary
  congress send 4 members name to high command who contest huzurabad by poll 2021. that four members not a mention konda surekha name.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X