• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కాంగ్రెస్‌లో కోవర్టుల లొల్లి.. జగ్గారెడ్డి అలా.. వీహెచ్ ఇలా.. అసలేం జరుగుతోంది?

|

హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటి? టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలని కలలుగంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు చేజారుతుండటం, పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం.. హైకమాండ్‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇలాంటి సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్గత విషయాలపై రచ్చకెక్కుతుండటం చర్చానీయాంశమైంది. అదలావుంటే పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ మొన్న జగ్గారెడ్డి, నేడు వీహెచ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

చేజారిపోతున్నా.. చేయందించేవారేరి?

చేజారిపోతున్నా.. చేయందించేవారేరి?

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మహా సముద్రం లాంటి ఆ పార్టీలో నేతలకు కొదువ లేదు. మంత్రులుగా పనిచేసినవారు ఉన్నారు.. ఇతర రంగాల్లో విశేషమైన అనుభవమున్నవారూ ఉన్నారు.. కానీ రానురాను పార్టీ నీరసించిపోతోందే తప్ప జవసత్వాలు నింపే నాయకత్వం కనిపించడం లేదు. ఇక టీఆర్ఎస్ అధిష్టానం జోరు గురించి వేరే చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలను సైతం తమ వైపు తిప్పుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు చేజారిపోతుంటే.. ఆపాల్సిన నాథుడే కరువయ్యాడు. ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇష్టానుసారంగా పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోతుంటే నిలువరించే లీడర్లే లేకుండా పోయారు. అసలు అంత పెద్ద పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యలతోనే సతమతమవుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి అంతర్గత పోరు మరో పెద్ద సమస్యగా మారింది.

ఏటీఎం క్యాష్ బాక్స్ ఎత్తుకెళ్లింది వాళ్లే.. సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఖాళీ పెట్టె..పోలీసుల వేట ముమ్మరం

కోవర్టులున్నారు.. సమయమొస్తే బయటపెడతా..!

కోవర్టులున్నారు.. సమయమొస్తే బయటపెడతా..!

కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు స్టైలే వేరు. ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. ఒకరకంగా చెప్పాలంటే స్వపక్షంలో విపక్షం టైపు అన్నమాట. తన వాగ్ధాటితో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.. అదే సమయంలో పక్కోడికి పొగ పెట్టేస్తారు. అలాంటి పెద్దాయన మరో బాంబ్ పేల్చారు. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ ఉన్న విషయమంతా బయటపెట్టారు.

వి.హనుమంతరావు నోరు విప్పితే అంతే సంగతులు. ఎవరిదో ఒకరి బండారం బయటపడాల్సిందే. ఎదుటివాళ్లు ఎవరని చూడరు.. సమయమొస్తే ఆరోపణాస్త్రాలు సంధిస్తారు. ఆయనతో మనకెందుకులే అని చాలామంది తమకు తాము సర్ధిచెప్పుకుంటారు. వీహెచ్ తో పెట్టుకుంటే అంతే సంగతులు అంటారు ఆయన గురించి తెలిసిన కొందరు. అలా ఆయన తాజాగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సొంత గూటి తప్పులను బయటపెట్టడంతో పార్టీ పెద్దలకు ఏమి తోచని పరిస్థితి తయారైంది.

 ఉత్తమ్ ఏం జేస్తుండు..!

ఉత్తమ్ ఏం జేస్తుండు..!

ఏ పార్టీలోనైనా అంతర్గత విషయాలు బయటపెట్టొద్దనేది ఒక కండిషన్. ఇక మహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో అలాంటి నిబంధనలు కాస్తా ఎక్కువే. అయితే తాజాగా వీహెచ్ చేసిన కామెంట్స్ చర్చానీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులున్నారంటూ పెద్ద బాంబ్ పేల్చారు. తాను ఎప్పటినుంచో మొత్తుకుంటున్నా.. పట్టించుకునే నాథుడే లేనట్లుగా ఆయన మాట్లాడిన తీరు హాట్ టాపికయింది.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇది క్లిష్టమైన సమయం అని చెప్పొచ్చు. నేతలంతా ఏకతాటిపై నడిస్తే తప్ప బండి ముందుకెళ్లలేని పరిస్థితి. అలాంటిది పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ వీహెచ్ చేసిన కామెంట్స్.. అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, సమయం వచ్చినప్పుడు ఆ కోవర్టులు ఎవరో తానే బయటపెడతానంటూ చెప్పుకొచ్చారు. అయితే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కోవర్టులను ఎందుకు ఉపేక్షిస్తున్నారోననే విషయం తనకు అర్థం కావడం లేదన్నారు.

 జగ్గారెడ్డి నోట అదే మాట

జగ్గారెడ్డి నోట అదే మాట

ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి.. సొంత గూటి నేతల ఆరోపణలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చానీయాంశంగా మారాయి. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ మాట్లాడటం హాట్ టాపికయింది. అయితే ఆ కోవర్టులు ఎవరనేది సమయం వచ్చినప్పుడు బయటపెడతానని వ్యాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడారని ఆరోపించారు.

మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కోవర్టుల లొల్లి బాగానే ముదిరేటట్లు కనిపిస్తోంది. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు.. ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్లు లెవనెత్తిన కోవర్టుల అంశంతో.. ఎవరు వారు అనేది ఇంటర్నల్ గా బాగా ఫైరయ్యే అవకాశం కనిపిస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Situation Of Congress Party Worst At Present. The Congress MLA's jumped into TRS Party. At this time, the senior congress leaders comments going hot topic. VH and Jaggareddy argued that there are coverts in congress party. In this bad situation, the senior leaders comments head ache to congress highcommand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more