హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ నేతలు కోటీశ్వరులు.. ఉద్యోగులు బికారీలయ్యారు.. కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నేతలు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీకి ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ కార్మికుల బంద్ నేపథ్యంలో మాట్లాడిన ఆయన ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే మసైపోతారని హెచ్చరించారు. గతంలో సమైక్య పాలకులను హెచ్చరించిన కేసీఆర్ ఇప్పుడు ఆయన సొంత రాష్ట్రంలో ఆయన తీరుతో మసికాక తప్పదన్నారు.

 ఆర్టీసీ సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ..తెలంగాణా సర్కార్ పై లక్ష్మణ్ ఫైర్ ఆర్టీసీ సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ..తెలంగాణా సర్కార్ పై లక్ష్మణ్ ఫైర్

పక్క రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతం కోసం ప్రభుత్వంలో వీలీనం చేశారని, సీఎం కేసీఆర్ పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసైనా బుద్ధి తెచ్చు కోవటం లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా కార్మికులను సమ్మె వైపు పురికొల్పిందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక అంతే కాదు ఆర్టీసీ కార్మికులను విధులు నిర్వర్తించకుండా తొలగిస్తామని భయబ్రాంతులకు గురి చేయడం మంచిది కాదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ తీరు సరిగా లేదని విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ కార్మికులు నాడు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, ఆర్టీసీ కార్మికులు లేకపోతే నాటి తెలంగాణ ఉద్యమం జరిగే అని ఆయన ప్రశ్నించారు. టిఆర్ఎస్ నాయకులు కోటీశ్వరులు అయ్యారుకానీ ఉద్యమం చేసిన ఉద్యోగులు బికారీలు అయ్యారని షబ్బీర్ అలీ మండిపడ్డారు.

Congress support for RTC workers strike ... Shabbir ali, jeevan reddy Fire on kcr

ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని మండిపడిన షబ్బీర్ అలీ అవసరం అయినప్పుడు మాట అవసరం తీరాక మరో మాట మాట్లాడే వ్యక్తి కేసీఆర్ అని విమర్శలు గుప్పించారు . కార్మికులను డిస్మిస్ చేస్తామంటే ప్రజలు కేసీఆర్‌ను డిస్మిస్ చేస్తారని స్పష్టం చేశారు షబ్బీర్ అలీ. టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తుందని పేర్కొన్న షబ్బీర్ అలీ ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయకుంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే బిజెపి తమ సంపూర్ణ మద్దతు ఆర్టీసీ కార్మికులకు ప్రకటించింది. సీఎం కేసీఆర్ దిగి వచ్చే వరకు నిరవధిక సమ్మె చేస్తామన్న ఆర్టీసీ కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించింది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ అధికార టిఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు.

English summary
congress leaders shabbir ali, jeevan reddy are outraged over the government's attitude that the demands of RTC workers should be treated as a tyranny. Esma will act if they does not attend duties. the government threatens are not good . congress supports to the RTC workers strike and cm kcr have to consider their demands congress leaders said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X