హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖాతా తెరిచిన కాంగ్రెస్ ... ఏఎస్ రావు నగర్ , ఉప్పల్ లో కాంగ్రెస్ విజయం ,డబీర్ పురా ఎంఐఎం ఖాతాలో

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శించగా, తొలి రౌండ్ బ్యాలెట్ బాక్సుల లెక్కింపు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. తొలి రౌండ్ ఫలితాలలో అత్యధిక స్థానాలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్న పరిస్థితి కనిపించింది. ఇక ఎంఐఎం కూడా మొదటి రౌండ్ లో వెనుకబడినట్టు కనిపించినా తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోందని తాజా ట్రెండ్ ను బట్టి అర్థమవుతోంది.

కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించదు అనుకున్నా, గ్రేటర్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయాలను నమోదు చేస్తుంది.

Congress victory in AS Rao Nagar and Uppal, Dabirpura in MIM account

కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన ఏ.ఎస్.రావు నగర్ లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శిరీష రెడ్డి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా గ్రేటర్ లో ఖాతా తెరిచి నట్లయింది. ఇక అంతే కాకుండా మరో డివిజన్ అయిన ఉప్పల్ లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం రజిత ఉప్పల్ లో విజయం సాధించారు.ఎం రజిత ఉప్పల్ లో విజయబావుటా ఎగురవేయటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది .

గ్రేటర్ లో రెండు చోట్ల టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా రెండు చోట్ల ఇప్పటివరకు ఎంఐఎం విజయాన్ని సాధించింది. ఎంఐఎం మొదట మెహదీపట్నంలో ఖాతా తెరవగా , రెండో స్థానంలో డబీర్ పూర్ నుండి హుసేన్ ఖాన్ విజయం సాధించారు. ఎంఐఎం పార్టీ నుండి అభ్యర్థి గా బరిలోకి దిగిన ఆయన గెలుపొందారు.

తొలి విజయం ఎంఐఎం ఖాతాలో ... ఆపై మెట్టుగూడా, యూసుఫ్ గూడాలోనూ టీఆర్ఎస్ విజయంతొలి విజయం ఎంఐఎం ఖాతాలో ... ఆపై మెట్టుగూడా, యూసుఫ్ గూడాలోనూ టీఆర్ఎస్ విజయం

ఇప్పటి వరకు టీఆర్ఎస్ రెండు , ఎంఐఎం రెండు , కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించారు . ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. సర్వత్రా ఫలితాలపై ఆసక్తి నెలకొంది .

Recommended Video

GHMC Election Results 2020 : ఇదివరకటి కంటే అధిక డివిజన్లను గెలుచుకుంటాం! - MLC Kalvakuntla Kavitha

English summary
While the Congress party is not expected to make a big impact in the Greater elections, the Congress party will also register victories in the Greater elections.congress party won in as rao nagar and uppal divisions , MIM another victory in Dabeerpura .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X