హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తత్కాల్ సిలిండర్: బుక్ చేసిన గంటల్లో సిలిండర్, రూ.25 ఎక్కువ..

|
Google Oneindia TeluguNews

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవకాశం కల్పిస్తోంది. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులకు తత్కాల్ సేవలు అందజేస్తోంది. తత్కాల్ సేవ అంటే సిలిండర్ బుక్ చేసిన గంటల్లో అందజేస్తామని స్పష్టంచేసింది. శిలా భారత జీవనం కింద తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించింది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసింది. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో కూడా ప్రారంభించబోతోంది.

హైదరాబాద్‌లో ప్రారంభించిన పథకాన్ని కేంద్రం అభినందించింది. దేశవ్యాప్తంగా కూడా ఇదే పథకం అమలు చేయాలని భావించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని అనుకుంటోంది. అయితే తత్కాల్ కింద బుక్ చేసేవారు రూ.25 ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తత్కాల్ బుక్ చేస్తే.. సిలిండర్ డెలివరీ చేస్తారు. ఇందుకోసం కొత్త యాప్ కూడా ఆవిష్కరిస్తామని చెబుతున్నారు.

Consumers can get gas cylinders within hours of booking

ఆన్ లైన్‌‌లో బుక్ చేస్తే సిలిండర్ వస్తోంది. అయితే డెలివరీ చేశాక రిసిట్ మాత్రం ఇవ్వరు. నగదుకు సంబంధించి.. మేసేజ్ సెండ్ చేస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రారంభించాలని అనుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటోంది. రైతు బంధు, రైతు బీమా పథకాలను కూడా అమలు చేసింది. అలాగే తత్కాల్ సిలిండర్ విధానాన్ని కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటోంది.

English summary
Indian Oil Corporation has decided to offer ‘Tatkal’ booking facility to those consumers who have only one gas cylinder
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X