viral:కానిస్టేబుల్ చేతిలో తుపాకీ, జోష్గా డ్యాన్స్.. చివరికీ సస్పెండ్
పెళ్లిలో బారత్ అంటే మాములుగా ఉండదు. అయితే కొందరు మత్తులో పిచ్చి పనులు చేస్తారు. దగ్గర తుపాకీ ఉంటే తీసుకొని కాలుస్తున్నారు. అదీ సరదాకు చేసిన నేరమే.. ఎందుకంటే కొన్ని సందర్బాల్లో మిగతావారు గాయపడే అవకాశం ఉంటుంది. అందుకే దీనికి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే ఉత్తరప్రదేశ్లో ఖాకీలు డ్యాన్స్ చేశారు. అయితే ఒకరు తుపాకీ పట్టుకొని మరీ స్టెప్పులు వేశారు. ఇంకేముంది సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు.

యూనిఫామ్ వేసుకొని.. గన్ పట్టుకొని
యూపీలో గల ఝాన్సీ సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. అయితే పోలీస్ స్టేషన్లో యూనిఫామ్ వేసుకొని మరీ డ్యాన్స్ చేశారు. కొందరు యూనిఫామ్ వేసుకోగా.. సివిల్ డ్రెసులో ఉన్నారు. వారంతా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. డిస్కో బీట్పై ఆడుతున్నారు. అంతా జోష్లో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే ఊపులో లేరు.

చేతిలో తుపాకీ
ఇంతలో కానిస్టేబుల్ కుల్దీప్ చేతిలో తుపాకీ పట్టుకున్నారు. ఇంకేముంది అదీ తెగ వైరల్ అవుతుంది. ఖాకీ గన్ పట్టుకోవడం ఏంటీ అనే చర్చ జరిగింది. విషయం పై అధికారులకు తెలిసింది. దీంతో కానిస్టేబుల్ కుల్దీప్పై చర్యలకు ఉపక్రమించారు. అతనిని సస్పెండ్ చేశారు. మరెవరు ఇలా చేయకూడదని కఠినంగా వ్యవహరించారు. దీనిపై ఉన్నతాధికారులకు కానిస్టేబుల్ ఏ వివరణ ఇవ్వనున్నారో చూడాలీ.


ఫైర్ చేసి కూడా..?
అంతకుముందు చాలా సందర్భాల్లో కూడా తుపాకీ పట్టుకొని కనిపించారు. కొందరు గన్ పట్టుకోగా.. మరికొందరు పేల్చారు. వారందిరీపై తగిన చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి గన్ లైసెన్స్ ఉన్నవారు ఆత్మరక్షణ కోసమే దానిని యూజ్ చేయాలి. కానీ కొందరు.. పేరు, ప్రతిష్ట పేరుతో బయటకు తీసుకొస్తారు. ఇంకేముంది రచ్చ రచ్చ చేసి.. ఇలా వివాదాలకు కేంద్రం అవుతారు. మరికొందరిపై చర్యలు తీసుకుంటారు. ఝాన్సీలో ఇలా కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు.