హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వింగ్స్ ఇండియా 2020పై కరోనా ఎఫెక్ట్: తెలంగాణకు ఏరోస్పేస్ అవార్డు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా-2020 ఏవియేషన్ షో ఆదివారం ముగిసింది. కరోనావైరస్ భయంతో సందర్శకులకు అనుమతించలేదు. పరిమితి సంఖ్యలో మాత్రమే సందర్శకులు వచ్చారు. దీంతో శనివారం సాయంత్రం నుంచే చాలా వరకూ స్టాళ్లు మూసివేయడం గమనార్హం.

కాగా, వింగ్స్ ఇండియా ప్రదర్శనలో సారంగ్ టీం, మార్క్ జెఫ్రీ బృందాలు నిర్వహించిన ఎయిర్ షోలు ఆకట్టుకున్నాయి. వివిధ రకాల విమానాలు, హెలికాప్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శనకు వచ్చిన వారు ఈ విమానాలు, హెలికాప్టర్ల ముందు నిల్చుని ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు.

corona effect on Wings India-2020: Telangana wins award for aerospace

అయితే, కరోనావైరస్ నేపథ్యంలో విమానాలు, హెలికాప్టర్లను తాకేందుకు సందర్శకులకు నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో దూరంగా ఉండే వాటిని వీక్షించారు సందర్శకులు. కాగా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో అప్రెంటీస్ చేస్తున్న 11 మంది విద్యార్థుల బృందం వింగ్స్ ఇండియా షోను సందర్శించేందుకు వచ్చారు. వీరంతా ఎస్‌యూ 30 నావిగేషన్ సిస్టంపై శిక్షణ తీసుకుంటున్నారు. ఈ షో కారణంగా తాము ఏవియేషన్ రంగంలో వస్తున్న మార్పులను గమనించామని, ఇవి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయన్నారు.

కాగా, ఏరోస్పేస్ పరిశ్రమ కోసం అత్యంత అంకితభావంతో ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అవార్డును గెలుచుకుంది. వింగ్స్ ఇండియా 2020 ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ తోపాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.

ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు పాత విమానాశ్రాయల పునరుద్ధరణ చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. విమానాశ్రయాలతోపాటు హెలి పోర్టులు, సీ ప్లేన్లపై రాష్ట్రం ఆసక్తిగా ఉందని తెలిపారు. విమానయానరంగం ఏటా 14 శాతం వృద్ధితో ఎదుగుతోందని తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాల కోసం కసరత్తులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయం కేంద్ర విమానయానశాఖ మంత్రితో చర్చించారు. ఏరోస్పేస్ వర్సిటీని కూడా నెలకొల్పుతామని చెప్పారు.

English summary
corona effect on Wings India-2020: Telangana wins award for aerospace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X