హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసులు సంపూర్ణేష్ బాబులా చేయకండి .. కరోనా కామెడీ కాదు : వర్మ ట్వీట్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతుంటే ప్రజల్లో అవగాహన కల్పించటానికి చేస్తున్న వివిధ ప్రయోగాలు కరోనా వైరస్ పై కాంట్రవర్సీలకు కారణం అవుతుంది . ఇక ఒకపక్క ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం , కరోనా వ్యాప్తి చెందకుండా చూడటం కోసం చాలా మంది ప్రముఖులు తమ వంతు ప్రయత్నం చేస్తుంటే వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ కరోనా విషయంలో ఆయన తనదైన్ స్టైల్ లో విభిన్నంగా స్పందిస్తున్నారు.

కరోనా దేవుళ్ళకు గుణపాఠం నేర్పిందన్న వర్మ

కరోనా దేవుళ్ళకు గుణపాఠం నేర్పిందన్న వర్మ

ఇక కరోనాకు పెద్ద చిన్నా అనే తేడా లేదని.. ఈ వైరస్‌ దెబ్బకు దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూడా మూసేశారు. కరోనా మామూలు ప్రజలతో పాటు దేవుళ్లకు కూడా పెద్ద గుణపాఠం నేర్పిందంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. దేవుళ్ళను టార్గెట్ చేసి విమర్శలు చేసిన వర్మ యాగాలు, యజ్ఞాలు, ప్రార్ధనలు చెయ్యాలనే మతపెద్దలను ఉద్దేశించి సెటైర్లు వేశారు.

వుహాన్ వెళ్లి అక్కడ నుండి కరతాళ ధ్వనులు చేస్తాను

వుహాన్ వెళ్లి అక్కడ నుండి కరతాళ ధ్వనులు చేస్తాను

జనతా కర్ఫ్యూ విషయంలో కూడా విభిన్నంగా స్పందించిన రాం గోపాల్ వర్మ జనతా కర్ఫ్యూ పేరుతో అందరం ఇళ్ళలో లాక్ చేసుకుని ఉంటె మేము కరోనాను లాక్ చేస్తాం అంటూ సెటైర్లు వేశారు. అంతే కాదు తానూ వుహాన్ వెళ్లి అక్కడ నుండి కరతాళ ధ్వనులు చేస్తానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక పోలీసులు కరోనా వైరస్ పై అవగాహన కల్పించటానికి చేసిన డాన్స్ వీడియో పై వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సంపూర్ణేష్ బాబు లా కామెడీ చెయ్యకండి అని వర్మ పేర్కొన్నారు.

పార్వతీపురం పోలీసులు కరోనా అవగాహనా డాన్స్ పై వర్మ సెటైర్లు

పార్వతీపురం పోలీసులు కరోనా అవగాహనా డాన్స్ పై వర్మ సెటైర్లు

ఏపీలోని విజయనగరం పార్వతీపురం పోలీసులు కరోనాపై అవగాహన కల్పించటం కోసం రాములో.. రాములా పాటకు డాన్స్ చేస్తూ ఉన్న వీడియోను రిలీజ్ చేశారు. ఇది కాస్తా ఆర్జీవీ దృష్టికి చేరడంతో ఆయన షాకింగ్ ట్వీట్ చేశారు. సమాజానికి దిశా నిర్దేశం చేసే పోలీసులు ఒక పద్దతి ప్రకారం ఉండాలి. సమాజంలో ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. కానీ సంపూర్ణేష్ బాబులా కామెడీ చేయకూడదంటూ వర్మ పోలీసులకు క్లాస్ పీకారు .

సీరియస్ సందర్భాల్లో ఇలాగేనా స్పందించేది

సీరియస్ సందర్భాల్లో ఇలాగేనా స్పందించేది

పోలీసులు డాన్స్ చేసే వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వర్మ పోలీసులు ఇలాంటి సీరియస్ సందర్భాల్లో ఎలా స్పందించాలో చెప్పారు. ఏపీలోని పార్వతీపురం పోలీసులు వాళ్ల ఉన్నతాధికారి వస్తే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వాళ్లు మాత్రం షేక్ హ్యాండ్ బదులు నమస్తే చెప్పాలంటూ రాములో రాములా పాటకు డాన్స్ చేస్తూ కరోనాపై స్వీయ నియంత్రణ ఎలా పాటించాలో చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.ఇక దీనిపై వర్మ కాస్త ఘాటుగానే స్పందించారు.

English summary
Ramgopal Varma, sensational director and care of adress to controversies has been tweeting about his style following the outbreak of coronavirus. Temples, mosques and churches have also been shut down for this virus attack. Director Ram Gopal Verma said that Corona has taught a lesson not only to common people as well as the gods. Varma, who targeted and criticized the gods, set out for religious leaders to perform yagas and prayers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X