హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో బాగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు ... ఒక్కరోజే 10 మంది .. 59కి చేరిన బాధితులు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రాన్ని గజగజా వణికిస్తుంది . తెలంగాణా ప్రభుత్వం ప్రజలకు ఇది వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ ను కూడా కట్టుదిట్టంగా అమలు చేస్తుంది . ఇలా దీంతో అంతా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కేసులు పెరుగుతున్న తీరు తెలంగాణా ప్రభుత్వాన్ని , అటు ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.

తెలంగాణలోనూ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తుంది. ఇక ఒక్క రోజే 10 కేసులు పెరగటం తెలంగాణా ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది .ఇక ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇక ఇప్పటి వరకు వీరిలో ఒకరు వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 58 మందికి చికిత్స కొనసాగుతోంది . తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తుంది . అయినా భయపడాల్సింది ఏమీ లేదని కచ్చితంగా పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు .

Corona positive cases increase in Telangana ... 10 victims today..total number 59

ఇక ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నా ప్రజల్లో మాత్రం భయం తగ్గటం లేదు . క్వారంటైన్ కేంద్రాల్లో 20 వేల మంది ఉన్నారని, వారికి పరీక్షలు, చికిత్స కొనసాగుతుందని చెప్తున్నారు . రాష్ట్రంలో 11000 ఐసోలేషన్ బెడ్స్, 1400 క్రిటికల్ బెడ్స్ రెడీగా ఉన్నాయని 60 వేల మంది కరోనా పేషెంట్లు ఉన్నా హాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేస్తుంది . అంతేకాదు లాక్‌డౌన్ సమయంలో పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి . కానీ తెలంగాణా రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రజలను టెన్షన్ పెడుతుంది. ఇళ్లకే పరిమితం అవుతున్నా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు ప్రతి ఒక్కరినీ షాక్ కు గురి చేస్తుంది .

English summary
The virus is spreading rapidly in Telangana. There have been 59 positive cases in the state so far. Telangana people are worried about the increase of 10 cases in a single day. One of them has since recovered and discharged from the disease. The remaining 58 are undergoing treatment. There were 10 positive cases in Telangana alone today. But there is nothing to fear, we will definitely fight, CM KCR said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X