హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో దంపతులకు కరోనా ..కాజీపేటలో పట్టుకుని గాంధీకి తరలింపు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచానికి ఇప్పుడు నిద్ర పట్టనివ్వటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 11 వేల మందిని బలితీసుకున్న ఈ వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా దారుణంగా ఉందని తెలుస్తుంది. ఇక దేశాలు దాటి విస్తరించిన వైరస్ ఇప్పుడు తెలంగాణలోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.ఇప్పటికే 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా అనుమానితుల సంఖ్య కూడా తీవ్రంగా పెరుగుతుంది.

కరోనా ప్రభావిత జిల్లాల్లో ఏపీ మంత్రుల పర్యటన .. అధికారులతో పరిస్థితి సమీక్షకరోనా ప్రభావిత జిల్లాల్లో ఏపీ మంత్రుల పర్యటన .. అధికారులతో పరిస్థితి సమీక్ష

తప్పించుకు పారిపోతున్న కరోనా పాజిటివ్ వ్యక్తులు

తప్పించుకు పారిపోతున్న కరోనా పాజిటివ్ వ్యక్తులు

తెలంగాణా రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న వేళ వైరస్ విస్తరించకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇక ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లోపం కనిపిస్తోంది. వైరస్ లక్షణాలున్న వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ వారు కూడా వైద్యులకు సహకరించకుండా భయంతో పారిపోతున్నారు. ఇప్పటికే పలువురు తప్పించుకునే ప్రయత్నం చేసి కరోనా వ్యాప్తిని మరింత పెంచుతున్నారు.

రాజధాని ఎక్స్ ప్రెస్ ఎక్కిన కరోనా బాధిత దంపతులు

రాజధాని ఎక్స్ ప్రెస్ ఎక్కిన కరోనా బాధిత దంపతులు

ఇక ఇదే సమయంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ఇద్దరు దంపతులు కరోనా లక్షణాలతో ఉండటంతో టీసీ గుర్తించి అధికారులకు తెలియజేశారు. కరోనా పాజిటివ్ అయినా ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకున్న భార్య భర్తల్ని రైల్వే అధికారులు గుర్తించారు. వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా రాజధాని ఎక్స్ ప్రెస్ వెళ్తున్న క్రమంలో బీ 3 బోగీలో ఉన్న దంపతులను టీసీ గుర్తించారు. ఇక వీరి చేతుల మీద ఐసోలేషన్‌లో చికిత్స చేసినట్లుగా గుర్తించే ముద్ర ఉంది.

గుర్తించిన టీసీ.. అదుపులోకి తీసుకున్న వైద్య సిబ్బంది

గుర్తించిన టీసీ.. అదుపులోకి తీసుకున్న వైద్య సిబ్బంది

దీనిని టీసీ గమనించిన టీసీ వారిని పలు ప్రశ్నలు వేశారు . ఇక వారు పొంతన లేని సమాధానం చెప్పడంతో పై అధికారులకు విషయాన్ని తెలియచేశారు. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యి కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఇక బోగీలో ఉన్న దంపతులను క్రిందికి దించి వారిని అదుపులోకి తీసుకున్నారు. 108 వాహనం ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో బీ 3 బోగీలో ఉన్న ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Recommended Video

PM Modi Telugu Speech On Coronavirus | 'Janata Curfew' Why Only One Day ? | Oneindia Telugu
కాజీపేట నుండి గాంధీ ఆస్పత్రికి తరలింపు

కాజీపేట నుండి గాంధీ ఆస్పత్రికి తరలింపు

వైద్యాధికారులు ప్రజలను ఆందోళన నుండి బయటకు తీసుకురావటానికి అక్కడకు చేరుకుని కరోనా వ్యాప్తి చెందకుండా రసాయనాలు చల్లారు. ఆ ప్రాంతమంతా శానిటైజర్ స్ప్రే చేశారు. ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఈ దంపతులను స్క్రీనింగ్ టెస్టులు చేసిన కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆసుపత్రిలోని గాంధీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ సందర్భంగా వారి చేతులపై ముద్ర వేసి చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా వైరస్ అంటే భయపడిన వారు వైద్య సిబ్బంది ఏం చేస్తారో అన్న భయంతో ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకుని వెళ్లి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కినట్లుగా తెలుస్తోంది. ఇక వీరిని గుర్తించి తిరిగి గాంధీ ఆస్పత్రికే పంపటం గమనార్హం .

English summary
couple with corona features in the rajadhani Express train were identified and notified the authorities. Railway officials have identified the husband and wife who escaped the isolation ward despite being corona positive. The couple, who were on board the B3 coach , were taken into custody in the rajadhani Express over the Kazipet railway station in Warangal district. 108 was taken to Gandhi Hospital by vehicle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X