హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా రిపోర్ట్ కంపల్సరీ: లేదంటే నో, ఎమ్మెల్యే పీఏలకు నో పర్మిషన్: అసెంబ్లీ సెషన్‌పై స్పీకర్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల అన్నీ వ్యవస్థలు స్తంభించిపోయాయి. అత్యవసరం ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకొస్తున్నారు. అయితే సోమవారం (7వ తేదీ) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. ప్రతీ సభ్యుడు విధిగా కరోనా వైరస్ నిర్ధారణ రిపోర్టుతో సభకు హాజరుకావాలని స్పష్టంచేశారు. అంతేకాదు వైరస్ లక్షణాలు కనిపించినా వారు కూడా.. సమావేశాలకు రావొద్దని తేల్చిచెప్పారు.

జ్వరం ఉంటే రావొద్దు..

జ్వరం ఉంటే రావొద్దు..

జ్వరం ఉన్నా, దగ్గు, జలుబు ఉన్నా ప్రతినిధులు సభకు రావొద్దని సభ్యులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టంచేశారు. సభ్యులు రోనా టెస్ట్‌ చేయించుకొని అసెంబ్లీకి రావాలని.. నెగిటివ్ రిపోర్ట్ చూసిన తర్వాతనే అసెంబ్లీ లోనికి అనుమతిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో సహా ఎవరికి పాజిటివ్ వచ్చినా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించబోమన్నారు.

ఎమ్మెల్యేల పీఏలకు నో పర్మిషన్..

ఎమ్మెల్యేల పీఏలకు నో పర్మిషన్..

ఎమ్మెల్యేల పీఏలకు అనుమతి ఇవ్వడం లేదని.. మంత్రుల పీఎస్‌లకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎంట్రెన్స్‌లో థర్మల్ టెస్టింగ్, శానిటైజర్ అందుబాటులో ఉంటుందన్నారు. హై టెంపరేచర్ ఉన్నవారు సభలోకి రావొద్దన్న ఆయన.. రోజూ ఉదయం, సాయంత్రం అసెంబ్లీని శానిటైజ్ చేస్తామని తెలిపారు. సభలో గల మైక్ కూడా రోజు శానిటైజ్ చేస్తామని చెప్పారు.

అసెంబ్లీ నుంచి ఇంటికే..

అసెంబ్లీ నుంచి ఇంటికే..

అసెంబ్లీకి వచ్చే ప్రతినిధులు.. తమ బంధువుల ఫంక్షన్‌, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. అసెంబ్లీ నుంచి ఇంటికి.. అక్కడినుంచి అసెంబ్లీకి వచ్చేలా చూసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కిట్ అందజేస్తున్నామని.. అందులో ఆక్సి మీటర్, శానిటైజర్ ఉంటుందన్నారు. ఆక్సిజన్ పర్సెంటేజ్ 90 లోపు ఉంటే సభకు రావొద్దని సూచించారు. ఈ సమావేశాలకు విజటర్స్‌ను కూడా అనుమతించామని పేర్కొన్నారు.

విజిటర్స్ గ్యాలరీ మీడియాకే

విజిటర్స్ గ్యాలరీ మీడియాకే


విజిటర్స్ గ్యాలరీని కూడా మీడియా ప్రతినిధులకే కేటాయిస్తామని వివరించారు. కానీ అసెంబ్లీ మీడియా పాయింట్ ఉండదన్నారు. అసెంబ్లీ బయట అంబులెన్స్‌, వైద్యులు, సిబ్బందితో పాటు ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సభ్యులు సభ గౌరవాన్ని కాపాడాలని.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోచారం సూచించారు. పార్లమెంట్‌లో అమలు చేయబోతున్న కోవిడ్ నిభందనలే ఇక్కడ అమలు చేస్తున్నామని తెలిపారు.

English summary
corona report mandatory speaker pocharam: coronavirus report mandatory to mlas assembly speaker pocharam srinivas reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X