హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీ మెడికల్ కాలేజీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా .. టెన్షన్ లో వైద్య సిబ్బంది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌‌లో గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అహర్నిశలు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు . వందలాది కరోనా పాజిటివ్ బాధితులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎవరికి వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వైరస్ ఏ విధంగా అయినా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపధ్యంలో వారు ప్రాణాలను పణంగా పెట్టి మరీ కరోనా పేషెంట్ లకు సేవలు చేస్తున్నారు.

ఏపీలో 10 నిముషాల్లోనే కరోనా టెస్టుల ఫలితాలు: దక్షిణ కొరియా నుండి ర్యాపిడ్ కిట్లు ఏపీలో 10 నిముషాల్లోనే కరోనా టెస్టుల ఫలితాలు: దక్షిణ కొరియా నుండి ర్యాపిడ్ కిట్లు

ఇక ఈ క్రమంలో గాంధీ మెడికల్ కాలేజీలో విధులు నిర్వర్తించే డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియటంతో వైద్య సిబ్బంది టెన్షన్ పడుతున్నారు . దాంతో ఒక్కసారిగా మెడికల్ కాలేజీ సిబ్బందిలో కలవరం మొదలైంది. కరోనా వైరస్ సోకిన వ్యక్తి మెడికల్ కాలేజీలో చాలామందిని కలిసిన నేపధ్యంలో అక్కడ పని చేస్తున్న సిబ్బంది టెన్షన్ పడుతున్నారు. అతడికి కాస్త అనారోగ్యం కలగటం, కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా సోకడం పట్ల మెడికల్ కాలేజీ సిబ్బందిలో భయాందోళన వ్యక్తం అవుతోంది.

Corona to data entry operator at Gandhi .. Medical staff in tension

కరోనా వచ్చిన ఆపరేటర్ డిపార్ట్ మెంట్ హెచ్ఓడీలను కూడా కలిశాడు. ఇక ఆ హెచ్ఓ డీ లు ఇప్పుడు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది . అయితే కరోనా సోకిన బాధితుడు అయిన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇప్పటివరకూ డిపార్టమెంట్లో ఎంతమందిని కలిశాడు? బయట ఎవరితో కాంటాక్ట్ అయ్యాడు అనే విషయాలని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముందుగా బాధితుడు పనిచేసే డిపార్ట్ మెంట్లో పనిచేసే మిగతా అందరికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా పేషెంట్ ల కోసం యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా సోకటం వైద్య వర్గాలకు పెద్ద టెన్షన్ గా మారింది.

Recommended Video

RBI Governor Press Meet Highlights, RBI Cuts Reverse Repo Rate By 25 Bps to 3.75%

English summary
Medical staff are in tension after knowing that Corona has been positive for a data entry operator performing duties at Gandhi Medical College. Soon there was a disturbance in the medical college staff. The staff working there are in tension with the coronavirus-infected person who has met many in medical college.He also met with the department HODs. Those HODs now need to undergo corona for tests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X