హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుట్టగొడులతో కరోనా కంట్రోల్: హైదరాబాద్ సీసీఎంబీ కీలక పరిశోధనలు, వ్యాక్సిన్ కంటే ముందే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వ్యాక్సిన్ తయారీలు కీలక పరిశోధనలు జరుపుతున్నారు. అనేక వ్యాక్సిన్ల ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. తాజాగా, భారత్‌లో తొలిసారిగా యాంటీ వైరల్ ఔషద ఆహారంపై ప్రయోగం విజయవంతమైంది.

Recommended Video

Eating Too Much Protein can cause health problems | Oneindia Telugu

కరోనా విరుగుడుపై పరిశోధనలు: భారతీయ అమెరికన్ యువతి అనికా చేబ్రోలుకు రూ. 25వేల డాలర్లుకరోనా విరుగుడుపై పరిశోధనలు: భారతీయ అమెరికన్ యువతి అనికా చేబ్రోలుకు రూ. 25వేల డాలర్లు

పుట్టగొడుగుల్లో యాంటీ యాక్సిడెంట్లు..

పుట్టగొడుగుల్లో యాంటీ యాక్సిడెంట్లు..


పుట్టగొడుగుల నుంచి ఫుడ్ సప్లిమెంట్ తయారీలో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ(సీసీబీఎం) హైదరాబాద్ కీలక ముందడుగు వేసింది. పుట్టగొడుగుల్లో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
వీటిలోని బీటా గ్లూకాన్స్ యాంటి వైరల్, యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు కలిగి ఉంటాయని పేర్కొంది.

కరోనా వ్యాక్సిన్ కంటే ముందుగానే..

కరోనా వ్యాక్సిన్ కంటే ముందుగానే..

కరోనావైరస్ వ్యాక్సిన్లకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆ మహమ్మారికి తక్షణ విరుగుడుగా ఫుడ్ సప్లిమెంట్ తయారు చేసేందుకు సీసీఎంబీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. అటల్ ఇంక్యుభేషన్‌లోని అంకుర సంస్థ క్లోన్ డీల్స్, సీసీఎంబీ సంయక్తంగా ఈ పరిశోధనలు చేశాయి. దిగ్గజ ఔషధ ఆహార ఉత్పత్తి సంస్థ ఆంబ్రోషియా ఫుడ్ ఫాంతో కలిసి సప్లిమెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయోగాలు చేపట్టింది.

ఊపిరితిత్తుల పనితీరు మెరుగు..

ఊపిరితిత్తుల పనితీరు మెరుగు..

పుట్టగొడుగుల్లోని కార్డిసెప్స్, కర్కమిన్‌తో కలిసి ద్రవ రూపంలో ఈ ఆహారం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పసుపు మిశ్రమంతో కలిసి కరోనాను ఎదుర్కోవడంలో ఈ లిక్విడ్ కీలక పాత్ర పోషించనుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపర్చడంతోపాటు యాంటీ ఆక్సిడెంట్‌గా రోగనిరోధక శక్తి పెంచేందుకు దోహదపడనుంది.

వచ్చే ఏడాది తొలినాళ్లలోనే..

వచ్చే ఏడాది తొలినాళ్లలోనే..

కరోనాను ఎదుర్కోవడంలో ఈ మిశ్రమం సమర్థంగా పనిచేస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. కాగా, ఇప్పటికే ఎయిమ్స్ దీన్ని క్లినికల్ ట్రయల్స్ లో ఉపయోగిస్తోంది. దీని పనితీరుపై ఎయిమ్స్ నాగ్‌పూర్, భోపాల్, నేవీ ముంబై కేంద్రాల్లో ప్రయోగాలు కొనసాగుతున్నాయి. 2021 తొలి రెండు నెలల్లో ఈ ఔషధ ఆహారం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వ్యాక్సిన్ల కంటే కూడా చాలా చౌవకగానే లభించనున్నట్లు సమాచారం.

English summary
corona will reduce with mushrooms: ccmb reaserch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X