• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చెస్ట్ ఆస్పత్రిలో నిన్న రవి.. నేడు సయ్యద్ బలి.. భయానక పరిస్థితులు...

|

ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రవి అనే యువకుడు మృతి చెందిన ఘటన మరవకముందే మరో విషాదం చోటు చేసుకుంది. సయ్యద్ అనే మరో వ్యక్తి సోమవారం(జూన్ 29) ఆక్సిజన్ అందక మృతి చెందాడు. రవి లాగే సయ్యద్ కూడా చెస్ట్ ఆస్పత్రిలో తనకు సరైన చికిత్స అందడం లేదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. రెండు రోజుల వ్యవధిలోనే చెస్ట్ ఆస్పత్రిలో ఇద్దరు పేషెంట్లు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. అదే సమయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆందోళనకరంగా పరిస్థితులు...

ఆందోళనకరంగా పరిస్థితులు...

హైదరాబాద్‌కి చెందిన ఓ వైద్యుడు ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ హైదరాబాద్‌లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. 'కరోనా పేషెంట్లందరికీ ఆక్సిజన్ అవసరం ఉండకపోవచ్చు. కానీ 5శాతం పేషెంట్లకు కూడా ఆక్సిజన్ అందట్లేదంటే ప్రభుత్వం చేతులెత్తేసినట్టే. ముందు నుంచి కేవలం గాంధీ ఆస్పత్రి పైనే ఆధారపడటం కూడా నిజానికి సరైన విధానం కాదు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అనేది కనీస అవసరం.. దానికి పెద్దగా ఖర్చు కూడా కాదు. అది కూడా అందించట్లేదంటే మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామో...' అంటూ ఆ వైద్యుడు పేర్కొన్నారు.

పీపీఈ కిట్లు,మాస్కులు కూడా ఇవ్వట్లేదు...

పీపీఈ కిట్లు,మాస్కులు కూడా ఇవ్వట్లేదు...

'ప్రభుత్వాస్పత్రుల్లో చాలామంది వైద్యులకు ప్రభుత్వం ఇప్పటికీ పీపీఈ కిట్లు,మాస్కులు ఇవ్వట్లేదన్న విమర్శలున్నాయి. ఎన్‌జీవోలు ఇచ్చినవి లేదా సొంత డబ్బులతో కొనుక్కున్న వాటితోనే వాళ్లు పనిచేస్తున్నారు. ఒక్క పీపీఈ కిట్‌ను ఆరు గంటలకు మించి వాడితే ఉపయోగం ఉండదు. అలాగే ఎన్‌ 95 మాస్కు కూడా. కానీ మన వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ దాదాపు 12 గంటలు ఒకే పీపీఈ సూట్‌లో పనిచేస్తున్నారు. అందుకే వైద్యులు సైతం కరోనా బారిన పడుతున్న పరిస్థితి.' అని ఆ వైద్యుడు చెప్పారు.

ఆక్సిజన్ దగ్గరే ప్రాణం పోతే... మరి వెంటిలేటర్లు అవసరమైతే...

ఆక్సిజన్ దగ్గరే ప్రాణం పోతే... మరి వెంటిలేటర్లు అవసరమైతే...

'కరోనా లక్షణాలతో ఎవరైనా ఆస్పత్రిలో చేరినా... 3,4 రోజులకే వారిని పంపించేసి హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని చెబుతున్నారు. దీంతో ఆ పేషెంట్లు బయటకొచ్చాక ఇష్టమొచ్చినట్టు తిరిగి వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారు. కాబట్టి రోగం పూర్తిగా నయమయ్యేంత వరకూ పేషెంట్లను ఐసోలేషన్‌లోనే ఉంచాలి. అలాగే టెస్టులను పెంచాలి. ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రమని చెబుతున్న రాష్ట్రంలో రోజుకు 30వేల టెస్టులు చేస్తుంటే... మన రాష్ట్రంలో 3వేల టెస్టులు కూడా చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. ఆక్సిజన్ అందకనే ఇంతమంది చనిపోతే... వైరస్ తీవ్రత పెరిగి వెంటిలేటర్ల అవసరం ఎక్కువ ఏర్పడితే పరిస్థితి ఏంటి' అని ప్రశ్నించారు.

  Telangana-AP border: No vehicle Entry Into Guntur District Between 7pm & 7am
  నిన్న రవి అనే యువకుడు మృతి...

  నిన్న రవి అనే యువకుడు మృతి...

  ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో ఆదివారం(జూన్ 28) రవి అనే యువకుడు ఆక్సిజన్ అందక చనిపోయిన విషయం తెలిసిందే. చనిపోవడానికి ముందు అతనో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. 'ఊపిరి ఆడటం లేదని చెప్పినా ఆక్సిజన్‌ బంద్‌ చేసిన్రు. సార్‌ సార్‌ అని బతిమాలినా పట్టించుకోలే. ఇప్పటికే మూడు గంటలైంది. గుండె ఆగిపోయింది. ఊపిరొక్కటే కొట్టుకుంటోంది. డాడీ బై.. డాడీ బై, అందరికీ బై డాడీ' అంటూ రవి ఆ వీడియోలో పేర్కొన్నాడు. కరోనా కేసులు,మరణాలు పెరుగుతుండటంతో.. వైరస్ నియంత్రణలో,వైద్య సదుపాయాల కల్పనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

  English summary
  Another patient in Erragadda chest hospital died on Monday allegedly due to lack of treatment,before his death he recorded a selfie video and sent it to his father.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more