హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వైరస్: తెలంగాణలో 36 పాజిటివ్ కేసులు.. సీఎం సహాయ నిధికి సత్యనాదెళ్ల రూ.2కోట్లు విరాళం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల సహకారం కూడా తోడైతేనే ఈ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. మార్చి 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఎప్పటికప్పుడు కరోనా వ్యాప్తిపై సమీక్షిస్తున్నారు. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు.

విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు 14 రోజులపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దని తేల్చి చెప్పారు. కుటుంబసభ్యులు కూడా వాళ్లను బయటికి రానీవద్దని, స్వీయ నియంత్రణ పాటిస్తే మంచిదన్నారు. అలాంటివారు బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Coronavirus Pandemic:Here are the daily live updates in Telangana

Newest First Oldest First
7:39 PM, 9 Dec

ఏపీలో 618 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు
4:44 PM, 25 Mar

రహదారులపైకి వస్తోన్న వారిని హెచ్చరించి పంపిస్తోన్న పోలీసులు
4:26 PM, 25 Mar

కర్ఫ్యూ..

లాక్‌డౌన్ సందర్భంగా తెలంగాణలో బోసిపోయిన రహదారులు
3:57 PM, 25 Mar

సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ, సాయంత్రం 6 గంటలకు షాపులు మూసేయాలంటోన్న పోలీసులు
3:30 PM, 25 Mar

హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్ల ముందు బారులు తీరిన హాస్టల్ విద్యార్థులు,విద్యార్థినులు,బ్యాచిలర్స్. స్వస్థలాలకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖలు.
2:13 PM, 25 Mar

ఎల్బీనగర్ సమీపంలో స్వస్థలాలకు వెళ్లేందుకు హాస్టళ్ల నుంచి బయటకొచ్చిన కొంతమంది విద్యార్థినులు.. హాస్టల్‌లో ఉండలేక... సొంత ఊళ్లకు వెళ్లే వాహనాలు లేక రోడ్ల పైనే పడిగాపులు..
2:12 PM, 25 Mar

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్‌లపై కూర్చొండిపోయిన ఇతర రాష్ట్రాల వ్యక్తులు. లాడ్జిలు ఖాళీ చేయించడంతో.. ఏపీలోని తమ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు లేక ఇబ్బందిపడుతున్నారు. ఉగాది సందర్భంగా తమను సొంత ఊళ్లకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతున్నారు.
12:48 PM, 25 Mar

పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టిన హాస్టల్ విద్యార్థులు. స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని పోలీసులకు విజ్ఞప్తులు. హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోవాలంటున్న యాజమాన్యాలు.
11:18 AM, 25 Mar

ఇప్పటికే తనయుడిపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీపై చర్యలు
11:17 AM, 25 Mar

18న లండన్ నుంచి కొత్తగూడెం వచ్చిన డీఎస్పీ కుమారుడు. డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ
11:15 AM, 25 Mar

కొత్తగూడెం డీఎస్పీకి కరోనావైరస్ పాజిటివ్..అతని ఇంట్లో పనిచేసే వంటమనిషికి కూడా కరోనా వైరస్ పాజిటివ్
11:00 AM, 25 Mar

గ్రామాల్లో కొనసాగుతున్న సరిహద్దుల మూసివేత. ఇతరులు గ్రామాల్లోకి రాకుండా ముళ్లకంచెలు,బండలు అడ్డుగా పెడుతున్న గ్రామస్తులు.బడంగ్ పేట్‌లోని గుర్రంగూడలో సరిహద్దును మూసివేసిన గ్రామస్తులు
9:36 AM, 25 Mar

కరోనా వైరస్ లాక్ డౌన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికతో రోడ్ల పైకి ప్రజా ప్రతినిధులు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెల్లవారుజామునే చెక్ పోస్టు వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు.
9:18 AM, 25 Mar

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 566 కరోనా పాజిటివ్ కేసులు.. కరోనా సోకిన 11 మంది మృతి..
8:38 AM, 25 Mar

తెలంగాణలో మంగళవారం మొత్తం ఆరు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు విదేశాల నుంచి వచ్చినవారు కాగా.. ముగ్గురిని లోకల్ కాంటాక్ట్ కేసులుగా గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది.
11:55 PM, 24 Mar

మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. ప్రజలు నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదని, మనకోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న డాక్టర్లు ఓక వేళ లాక్ డౌన్ చేస్తే ఎలా ఉంటుందనే డాక్టర్ వీడియోను పోస్టు చేశారు.
10:40 PM, 24 Mar

హైదరాబాద్ మరో కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 37కు చేరింది.
10:31 PM, 24 Mar

ప్రజలు ఏదైనా వ్యాధి బారిన పడినా.. ఎవరైనా చనిపోయినా.. ఇలాంటి ఎమర్జెన్సీ సందర్భాల్లో 100కు పోన్ చేసి తెలపాలని, పోలీసులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తారన్నారు సీఎం.
9:40 PM, 24 Mar

మీడియా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించవద్దని, వారికి ప్రభుత్వం నుంచి అనుమతి ఉందని చెప్పారు సీఎం కేసీఆర్.
9:06 PM, 24 Mar

కొన్ని గ్రామాలకు కంచెలు వేసుకున్నారని, ఇది మంచి పద్ధతి అన్నారు.
8:49 PM, 24 Mar

ప్రజలు ఏదైనా వ్యాధి బారిన పడినా.. ఎవరైనా చనిపోయినా.. ఇలాంటి ఎమర్జెన్సీ సందర్భాల్లో 100కు పోన్ చేసి తెలపాలని, పోలీసులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తారన్నారు.
8:26 PM, 24 Mar

హోంక్వారంటైన్ ఉండే వాళ్లంతా బయట తిరగొద్దని, ఆదేశాలను పాటించకుంటే కఠని చర్యలు తీసుకుంటామని, పాస్ పోర్టులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
7:59 PM, 24 Mar

రష్యా దేశం చాలా అద్భుతంగా పనిచేస్తోంది: సీఎం కేసీఆర్
7:57 PM, 24 Mar

మీడియాకు ప్రభుత్వం అనుమతించింది.. పోలీసులు మీడియాపై దౌర్జన్యం కుదరుదు: సీఎం కేసీఆర్
7:57 PM, 24 Mar

ప్రతి ఒక్కరు స్వీయనిర్బంధం పాటించాలి: సీఎం కేసీఆర్
7:54 PM, 24 Mar

సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ: సీఎం కేసీఆర్
7:52 PM, 24 Mar

సరిహద్దుల వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయినందున ఈ ఒక్కరోజు తెలంగాణలోకి ఎంట్రీ ఉంటుంది. రేపటి నుంచి ఒక్క వాహనం కూడా తెలంగాణలోకి రాకూడదు: సీఎం కేసీఆర్
7:49 PM, 24 Mar

ఉపాధి హామీ పనులు కూడా చేసుకోవచ్చు అయితే కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది: సీఎం కేసీఆర్
7:49 PM, 24 Mar

గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వ్యవసాయ పనులకు ప్రభుత్వం అనుమతిస్తోంది.. ఎలాంటి ఆటంకం ఉండదు: సీఎం కేసీఆర్
7:48 PM, 24 Mar

అన్ని రకాల షాపులు సాయంత్రం 6 గంటలకు బంద్ చేయాలి: సీఎం కేసీఆర్
READ MORE

English summary
Coronavirus Pandemic:Here are the daily live updates in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X