హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలో గుడ్ న్యూస్: కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చడంపై.. మండలిలో మంత్రి ఈటల

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. వైరస్ సోకిన వారి కోసం వైద్యారోగ్య శాఖ సిబ్బంది చేస్తున్న కృషిని కొనియాడారు. వారి సేవలను మాటలతో సరిపెట్టలేము అని పేర్కొన్నారు. వారు చేస్తున్న విధులకు.. ప్రభుత్వం ఎంత ఇచ్చినా తక్కువేనని స్పష్టంచేశారు. శుక్రవారం మండలిలో కరోనా పరిస్ధితులు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై పలువురు సభ్యులు ప్రశ్నించారు. దీనికి మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు.

కరోనా కబలింపు: ఏపీ తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ మృతి, 10 రోజులుగా చికిత్స, పలువురి సంతాపం..కరోనా కబలింపు: ఏపీ తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ మృతి, 10 రోజులుగా చికిత్స, పలువురి సంతాపం..

ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి ఈటల మరోసారి స్పష్టంచేశారు. కరోనా వైరస్‌ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ వస్తుందని.. ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామని ఈటల తెలిపారు. త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఎవరైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.

coronavirus treatment in aarogyasri in soon..

అయితే కరోనా వైరస్ తీవ్రత అందుబాటులో ఉంది అని ఈటల పేర్కొన్నారు. కానీ కరోనా వైరస్ తీవ్రత పెరిగితే బాధితులను రక్షించడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. దీంతో కేసుల తీవ్రత ఎక్కువగా లేదన్నారు. ఇతర రాష్ట్రాలతో చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో మరణాల శాతం తగ్గిందని ఈటల రాజేందర్ తెలిపారు.

Recommended Video

India - Japan : చైనాకు బుద్ధి చెప్పేలా.. Japan తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్ ! || Oneindia

English summary
coronavirus treatment in aarogyasri in soon health minister etela rajender said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X