పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, అధికార భాషకు శ్రీదేవి, ఫుడ్స్ చైర్మన్‌గా రాజీవ్ సాగర్
తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు నియామకాలు జరిగాయి. తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్‌గా మంత్రి శ్రీదేవిని నియమించారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్‌కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్ ను నియమించారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత అధికార భాషా సంఘం తొలి చైర్మన్‌గా దేవులపల్లి ప్రభాకర్ రావు నియమితులు అయ్యారు. అయితే ఆయన ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోస్టును మరొకరితో భర్తీ చేశారు.
తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్ రెండేళ్ల పాటు పదవీలో కొనసాగనున్నారు. మహిళా, శిశు, వికలాంగ, సీనియర్ సిటిజన్స్ విభాగం కింద తెలంగాణ ఫుడ్స్ కొనసాగుతుంది. తెలంగాణ జాగృతి కార్యకర్తగా ఉన్న మేడే రాజీవ్ సాగర్.. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 2006 నుంచి తెలంగాణ జాగృతి కోశాధికారిగా ఉన్నారు. తర్వాత తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శిగా ఆరేళ్లపాటు కొనసాగారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

మలి దశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో పనిచేశారు. ఉద్యమ, సాంస్కృతిక చిహ్నమైన తెలంగాణ జాగృతి నిర్మాణంలో కీ రోల్ పోషించారు. తెలంగాణ సమాజానికి ఆయన అందించిన సేవలను ఇప్పటికీ గుర్తించారు. ఈ మేరకు ఆయనకు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ పదవీ వరించింది.