హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి నుంచి ప్రాణహానీ: రక్షించాలని హెచ్ఆర్‌సీకి దంపతుల ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

గత ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు మహబూబ్‌నగర్‌కు చెందిన దంపతులు. ఓ కేసులో మంత్రికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. ఇక అప్పటి నుంచి తమకు వేధింపులు ప్రారంభం అయ్యాయని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన విశ్వనాథరావు-పుష్పలత దంపతులు వాపోతున్నారు. ఈ మేరకు ఆ దంపతులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని వారు ఆరోపించారు. వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పామనే కక్షతో తమపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ మహేశ్వర్‌తో అర్ధరాత్రి వేళలో ఇంటిపై దాడులు చేయిస్తున్నారని తెలిపారు. తమ ఇంటిల్లిపాదులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

couple complaint against minister srinivas goud

ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న తమను ఉద్యోగం నుంచి తీసివేయించారని విలపించారు. తమకు ఉపాధి కరవైందని గోడును కమిషన్‌కు వెల్లబోసుకున్నారు. తమ బతుకు ఎలాగోలా బతుకుతున్నామని.. ఇకనైనా వేధింపులు ఆపాలని కోరారు. మంత్రి, ఆయన సోదరుడి పేర్లతో లేఖరాసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని ఎస్‌హెచ్ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి లేఖపై కమిషన్ స్పందించాల్సి ఉంది.

బాధ్యతయుతమైన పదవీలో ఉన్న మంత్రి రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ పర్సనల్ విషయాలను కూడా పోలీసుల చేత బెదిరింపులకు దిగడం మంచి పద్దతి కాదని పలువురు అంటున్నారు. మంత్రిగా ఏం ప్రమాణం చేశారు.. ఇప్పుడు ఎలా బీ హేవ్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

English summary
mahbubnagar couple complaint against telangana minister srinivas goud in state hrc for threatening life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X