ఓ జ్యోతి వ్యధ: రెండు ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం, భర్తే దోషి
అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం వల్లే హత్య జరిగింది. జ్యోతి భర్తే, ఇద్దరినీ హత్య చేశాడని పోలీసులు చెప్పారు. జ్యోతి-శ్రీనివాస్ భార్యాభర్తలు. అయినప్పటికీ జ్యోతి యశ్వంత్ అనే యువకుడితో వివాహేతరం సంబంధం పెట్టుకుంది. అనుమానం వచ్చిన జ్యోతి భర్త శ్రీనివాస్ ఆ విషయాన్ని నిర్ధారించుకున్నాడు. జ్యోతి, యశ్వంత్ తరచూ కలుసుకునే ప్రదేశాలను గుర్తించాడు.
ఆ ప్రదేశాల్లో కొందరితో కలిసి రెక్కీ కూడా నిర్వహించాడు. ఈ నెల 1వ తేదీన సాయంత్రం, జ్యోతి-యశ్వంత్ అబ్దుల్లాపూర్‌మెట్ కొత్తగూడెం బ్రిడ్జికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్నారు. శ్రీనివాస్ మరికొందరితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. జ్యోతి ముందే యశ్వంత్‌ను దారుణంగా కొట్టి.. హత్య చేశారు. యశ్వంత్ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత జ్యోతిని కూడా మట్టుబెట్టారు. మృతదేహాలను అక్కడే పడేసి వెళ్లారు.

మంగళవారం అక్కడ పడి ఉన్న మృతదేహాలకు సంబంధించిన సమాచారం తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. భర్త శ్రీనివాసే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. తన భార్య వివాహేతర సంబంధం వల్ల హత్య చేశానని పోలీసులకు తెలిపారు. వివాహేతర సంబంధం వల్ల పచ్చటి కాపురంలో చిచ్చురేపింది. రెండు జీవితాలు నాశనం అయ్యాయి.
కట్టుకున్న భర్తను వదిలి.. మరొకరి మోజులో జ్యోతి పడింది. యశ్వంత్ కూడా ఆమెకు పెళ్లి అయ్యిందని వదలలేదు. సో శ్రీనివాస్ కూడా వారికి తగిన గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. ఇంకేముంది.. ఇద్దరినీ కలిసి పట్టుకున్నాడు. ఆవేశంలో యశ్వంత్‌ను మట్టుబెట్టాడు. జ్యోతి కూడా తనకు వద్దని.. చంపేశాడు. తర్వాత చేసిన నేరం ఒప్పుకున్నాడు.