హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘కోవాక్సిన్’ త్వరలోనే అందుబాటులోకి: గవర్నర్ తమిళిసై, భారత్ బయోటెక్ సందర్శన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. మంగళవారం శామీర్‌పేటలోని భారత్ బయోటెక్‌ను గవర్నర్ సందర్శించారు.

ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారీలో భాగస్వాములైన శాస్త్రవేత్తలతో తమిళిసై మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లుగా దేశంలో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవర్నర్ తెలిపారు.

covaxin will available soon: governor Tamilisai Soundararajan.

2020లోనే కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని గవర్నర్ తమిళిసై చెప్పారు. వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్న శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చినట్లు గవర్నర్ ఈ సందర్భంగా తెలిపారు. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు భారత్ బయోటెక్ కోవాగ్జిన్ అనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన భారత్ బయోటెక్ సంస్థ.. ఇటీవలే నిమ్స్‌లో రెండో దశ రెండో దశ ట్రయల్స్ ప్రారంభించింది. కాగా, భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది.

Recommended Video

Hyderabad లో తగ్గని Corona ఉధృతి, భౌతిక దూరం ఏది? | Corona Bulletin | Telangana

కాగా, తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,89,283 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1116 మంది మరణించారు. 1,58,690 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 29,477 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 29 లక్షల నమూనాలను పరీక్షించారు.

English summary
covaxin will available soon: governor Tamilisai Soundararajan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X