హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొవిడ్-19: హైదరాబాద్‌లో హైరిస్క్ జోన్లు ఇవే.. 100కుపైగా కంటైన్మంట్లకు అధికారుల కసరత్తు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 1269 మందికి వైరస్ సోకగా, అందులో 800 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారే కావడం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటిదాకా 34,671 మంది కరోనా బారిన పడగా, అందులో 26,574 మంది ఒక్క గ్రేటర్ పరిధిలోనే ఉండటం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

హైదరాబాద్ లో కేసులు, మరణాలు భారీగా ఉంటుండటం, ప్రతిరోజూ వెయ్యికి అటుఇటుగా కొత్త కేసులు నమోదవుతోన్న నేపథ్యంలో సిటీలో హైరిస్క్ జోన్లను అధికారులు గుర్తించారు. ఒక ప్రాంతంలో 500 లేదా అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా పరిగణిస్తున్నారు. ఇలాంటి జోన్లు సిటీలో మొత్తం 8 ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

శ్రీవారి ఆస్తులపై టీటీడీ కీలక నిర్ణయం.. కేంద్ర మంత్రి నిర్మలతో చైర్మన్ వైవీ భేటీ..శ్రీవారి ఆస్తులపై టీటీడీ కీలక నిర్ణయం.. కేంద్ర మంత్రి నిర్మలతో చైర్మన్ వైవీ భేటీ..

covid-19: high risk and containment zones identified in hyderabad

చాంద్రాయణగుట్ట, చార్మినార్, కార్వాన్, రాజేంద్రనగర్,కుత్బుల్లాపూర్, అంబర్ పేట్, యూసుఫ్ గూడ, మెహదీపట్నం సర్కిళ్లను హైరిస్క్ జోన్లుగా ప్రకటించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఒక్కొక్క జోన్ లో 10 నుంచి 20 వరకు మొత్తంగా 100కు పైగా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. హైరిస్క్ జోన్ల నుంచి ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని అధికారులు పేర్కొన్నారు.

Recommended Video

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు, టీపీసీసీ కార్యదర్శి జీ నరేందర్ యాదవ్ కరోనా వైరస్‌కు బలి!

లాక్ డౌన్ సడలింపుల తర్వాత కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో దేశంలోని మహానగరాలు మళ్లీ లాక్ డౌన్ వైపునకు మళ్లడం తెలిసిందే. బెంగళూరులో ఈనెల 14 నుంచి తిరిగి పూర్తి లాక్ డౌన్ అమలు కానుండగా, ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పుడా జాబితాలోకి హైదరాబాద్ కూడా వచ్చిచేరింది. అయితే, సిటీలో పూర్తిస్థాయి లాక్ డౌన్ కు ప్రభుత్వం విముఖంగా ఉంది. దీంతో కంటైన్మెంట్, హైరిస్క్ జోన్ల గుర్తింపు ద్వారానే వైరస్ వ్యాప్తిని నిరోధించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

English summary
it is learnt that, amid covid-19 cases raising in greater hyderabad region, ghmc officials have identified risk zones and in the process to create containment zones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X