హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్మకాయలు, తాయెత్తులతో కొవిడ్ ఖతం - అంటూ కరోనా బాబా ప్రచారం.. సినీ ఫక్కీలో చివరికి ఇలా..

|
Google Oneindia TeluguNews

''దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? మీకు కరోనా వైరస్ సోకిందేమోనని అనుమానంగా ఉందా? ఆస్పత్రులకు వెళ్లాలంటే భయంగా ఉందా? మాస్కులు ధరించకుండానే కరోనాకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇక ఏమాత్రం చింతించ వద్దు.. మీ కోసం కరోనా బాబా గారు అవతరించారు. అన్ని వేళలా అందుబాటులో ఉంటారు. చేయాల్సిందల్లా ఈ అడ్రస్ కు రావడమే.. '' అంటూ కొద్ది రోజులుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ వాట్సాప్ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. దీనిపై ఆరా తీసేలోపే అనూహ్యరీతిలో కరోనా బాబా గుట్టు రట్టయింది. మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వెంకటేష్‌ మీడియాకు వెల్లడించిన సమాచారం ఇలా ఉంది..

కిమ్ జాంగ్ కు మోదీ సర్కార్ భారీ సాయం - కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం - చైనా చైన్ తెగడంతో..కిమ్ జాంగ్ కు మోదీ సర్కార్ భారీ సాయం - కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం - చైనా చైన్ తెగడంతో..

న్యూ హఫీజ్‌పేట్‌లో అడ్డా..

న్యూ హఫీజ్‌పేట్‌లో అడ్డా..

తన దివ్య శక్తులతో కొవిడ్-19 వ్యాధిని నయం చేస్తానంటూ ప్రజల్ని మోసం చేస్తోన్న కరోనా బాబాను మియాపూర్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. న్యూ హఫీజ్‌పేట్‌లోని హనీఫ్‌కాలనీకి చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ చాలా ఏళ్లుగా అక్కడి దర్గాను తన అడ్డాగా మార్చుకుని రకరకాల సమస్యలతో వచ్చేవాళ్లకు మంత్రాలు వేస్తూ, తాయెత్తులు కడుతూ ఉండేవాడు. మార్చి నుంచి కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో తన పేరును కరోనా బాబాగా మార్చుకుని కొత్త రకం మోసాలకు తెరలేపాడు.

నిమ్మకాయలు, ఊదు పొగతో..

నిమ్మకాయలు, ఊదు పొగతో..

కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రజల్లో భయాందోళనలు రెట్టింపైన సమయంలో దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఇస్మాయిల్ ఖాన్ అలియాస్ కరోనా బాబా.. తనకు అతీంద్రియ శక్తులున్నాయని, కొవిడ్ ను క్షణాల్లో మటుమాయం చేస్తానని అమాయకులను నమ్మించాడు. తన దగ్గరికొచ్చే వ్యక్తులను ముందుగా.. ఊదు పొగతో శుద్ధి చేసినట్లు నటించి, ఏవేవో మంత్రాలు చదివి, విభూతిని తలకు రాసి, మంత్రించిన నిమ్మకాయలు చేతిలో పెట్టి, చివరికి మహిహగల తాయెత్తంటూ మెడలో ఓ యంత్రాన్ని కట్టి పంపేస్తాడు. అంతేకాదు, ఒక్కసారి తన దగ్గరికి వచ్చి వెళితే, ఇకపై మాస్కు ధరించాల్సిన అవసరమే ఉండదని నమ్మించేవాడు. జనాన్ని ఆకట్టుకునేందుకు టెక్నాలజీని కూడా వాడుకున్నాడీ కరోనా బాబా..

60 మందితో వాట్సాప్ గ్రూప్..

60 మందితో వాట్సాప్ గ్రూప్..

ఇస్మాయిల్‌ తోపాటు అతని ముఖ్య అనుచరుడైన సలీం బాబా దగ్గరికి వచ్చే 60 మంది భక్తులతో ముందుగా వాట్సాప్‌గ్రూప్‌ ను క్రియేట్ చేశారు. ఆ గ్రూపు ద్వారా.. బాబాకు కరోనాను తగ్గించే అతీతశక్తులు ఉన్నాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో హఫీజ్ పేట్, మియాపూర్ తోపాటు మెహదీపట్నం, బోరబండ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అమాయకులు కరోనా బాబా కోసం క్యూ కట్టడం మొదలుపెట్టారు. గుట్టు రట్టు కాకుండా ఉంటే ఇంకా వేల మంది ఇతని బారినపడేవాళ్లే..

జగన్ డ్రీమ్-ఏపీ చరిత్రలో అతిపెద్ద లిఫ్ట్ -రాయలసీమ ఎత్తిపోతలపై కీలక పరిణామం- కేసీఆర్ సర్కారు గగ్గోలుజగన్ డ్రీమ్-ఏపీ చరిత్రలో అతిపెద్ద లిఫ్ట్ -రాయలసీమ ఎత్తిపోతలపై కీలక పరిణామం- కేసీఆర్ సర్కారు గగ్గోలు

 గుంపులుగా జనాన్నిచూసి ఫిర్యాదు..

గుంపులుగా జనాన్నిచూసి ఫిర్యాదు..

కరోనా బాబా తన అడ్డాగా మార్చుకున్న దర్గాలో ఇటీవల జనం ఎక్కువగా గుమ్మికూడుతుండటం, శుక్రవారం రాత్రి ఏకంగా 50మంది వరకూ రావడంతో స్థానికులు కొందరు అనుమానంతో మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ముందుగా అక్కడికొచ్చిన ప్రజలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కరోనా లక్షణాలుంటే ఆస్పత్రులకు వెళ్లాలేగానీ, ఇలాంటి మూఢ నమ్మకాలను, దొంగ బాబాలను నమ్మొద్దంటూ వాళ్లను ఇండ్లకు పంపేశారు. కరోనా బాబాపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, షాకింగ్ విషయాలు బయటపడ్డాయి..

Recommended Video

Motkupalli Narasimhulu Warns Ysrcp Goverment
కళ్లుచెదిరేలా కరోనా బాబా సంపాదన..

కళ్లుచెదిరేలా కరోనా బాబా సంపాదన..

అప్పటిదాకా దర్గాలో చిన్నచిన్న తాయెత్తులు కట్టుకుంటూ బతుకీడ్చిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌.. మార్చి చివరి వారం నుంచి కరోనా బాబాగా అవతారం ఎత్తిన తర్వాత కళ్లుచెదిరిపోయే రీతిలో డబ్బులు పోగేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది బాబా దగ్గర తాయెత్తులు కట్టించుకున్నారని, ఒక్కో బాధితుడి దగ్గర రూ.12వేల నుంచి రూ.28 వేల వరకు వసూలు చేసినట్లు వెల్లడైంది. ప్రజల్లోని కరోనా భయాన్ని ఈ రకంగా క్యాష్ చేసుకుంటోన్న దొంగ బాబాను కటకటాల్లోని నెట్టిన పోలీసులు.. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Cyberabad police, on Saturday, arrested a self-declared ‘miracle worker’ Mohd Ismayil alias Corona Baba, who has been cheating people under the guise of providing treatment for Covid-19 and other ailments, at Hafeezpet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X